Gold Prices Today : ఈరోజు బంగారం ధరలు ఊరిస్తున్నాయి.. కొనేసుకుంటారా మరి

బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న వార్తలు కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి

Update: 2024-04-22 04:08 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న వార్తలు కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ధరలు దిగిరావడం లేదు. ధరలు పెరిగిపోవడానికి అనేక కారణాలు చెబుతున్నా అవేమీ వినియోగదారుల చెవికెక్కడం లేదు. అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు మరింత పెరుగుతాయని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అదే నిజమవుతూ వస్తుంది.

సీజన్ ముగుస్తున్నా...
పెళ్లిళ్ల సీజన్ కూడా ముగుస్తుంది. అయినా బంగారం ధరలు మాత్రం నేల చూపులు చూపకపోవడంతో ఇక ధరలు తగ్గడం మాత్రం జరగదన్న విషయం తేలిపోయింది. అయితే ఆభరణాలు కొనుగోలు చేసే వారు మాత్రం కొంత తగ్గారని చెబుతున్నారు. గోల్డ్ బిస్కట్ రూపంలో ఉన్న బంగారాన్ని కొనుగోలు చేసి పెట్టుబడిగా చూసే వారు మాత్రం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. గత రెండు నెలల్లో పదకొండు వేల రూపాయల మేర బంగారం ధరలు పది గ్రాములకు పెరగడంతో వినియోగదారులు మరింత ఆందోళన చెందుతున్నారు
ఈరోజు ధరలు...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వరసగా పెరుగుతున్న బంగారం ధరలుకు బ్రేక్ పడింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా స్వల్పంగానే తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,040 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,230 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 89,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.



Tags:    

Similar News