ATM, QR కోడ్‌ మోసాలకు చెక్‌పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం

ఈ రోజుల్లో చిన్న కిరాణ కొట్టు నుంచి కూరగాయాలు అమ్మే వ్యాపారి, పెద్ద పెద్ద మాల్స్‌ వరకు అన్ని షాపుల్లో డిజిటల్‌..

Update: 2023-12-08 03:57 GMT

ఈ రోజుల్లో చిన్న కిరాణ కొట్టు నుంచి కూరగాయాలు అమ్మే వ్యాపారి, పెద్ద పెద్ద మాల్స్‌ వరకు అన్ని షాపుల్లో డిజిటల్‌ చెల్లింపులు జరుగుతున్నాయి. జేబులోంచి ఒక్కరూపాయి కూడా తీయకుండానే ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌లు జరుగుతున్నాయి. టెక్నాలజీ పెరిగినకొద్ది యూపీఐ లావాదేవీలు జరపడం మరింత సులభతరం అవుతున్నాయి. కానీ టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మోసగాళ్ళు మరింత 'స్కామ్' చేయడానికి మార్గాలను ఎంచుకుంటున్నారు. కొన్నిసార్లు ఎవరైనా UPI ID లింక్‌ని పంపడం ద్వారా లేదా ఎవరికైనా QR కోడ్‌ని పంపడం ద్వారా కూడా ప్రతిరోజూ మోసాలు జరుగుతున్నాయి. ఎవరైనా మెయిల్ నుండి OTP అడగడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ 'స్కామ్'లన్నింటికీ చెక్‌ పెట్టాలని యోచిస్తోంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం UPI సేవలను అందించే ప్రభుత్వ సంస్థ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో ఆన్‌లైన్ మోసం గురించి వివరంగా చర్చించాయి.

స్కామ్ ఎలా జరుగుతుంది?

స్కామర్లు మిమ్మల్ని మోసగించడానికి అనేక పద్ధతులను ఉపయోగిస్తారు. లాటరీని గెలిచారని ఆశచూపి మీకు ఫోన్‌ చేసి ఓటీపీలు అడుడుగుతుంటారు. మీ వివరాలు చెప్పమని నమ్మబలుకుతారు. అలాగే SMS రూపంలో లింక్‌లను పంపిస్తుంటారు. వాటిని ఓపెన్‌ చేయగానే మీ వివరాలన్ని స్కామర్లకు చేరిపోతాయి. లింక్‌ ఓపెన్‌ కాగానే ఖాతా హ్యాక్ చేస్తారు. ఇలా ఒక్కటేమిటి రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే మీకు QR కోడ్‌లను పంపుతూ కూడా మోసాలకు పాల్పడుతుంటారు.

మోసాలకు చెక్‌ పెట్టే మార్గమేంటి?

డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితంగా చేయడానికి, స్కామర్‌లను తొలగించడానికి అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా డిజిటల్ మార్గాల ద్వారా పెద్ద చెల్లింపు లావాదేవీలు చేసినప్పుడు, వారికి అదనపు భద్రత ఉండేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం UPI ద్వారా చెల్లింపు చేస్తున్నప్పుడు మీరు స్కాన్ చేసిన తర్వాత మాత్రమే మీ 'పిన్ కోడ్'ని నమోదు చేయాలి. కానీ త్వరలో నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ చెల్లింపుల కోసం పిన్‌తో పాటు ఓటీపీని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్‌ ఎంటర్‌ చేయగానే మీ రిజిస్ట్రర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసిన తర్వాతే మీకు ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.

ఇటీవల కొన్ని బ్యాంకులు తమ ATM లలో కూడా ఇటువంటి ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అలాగే యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ద్వారా జరిపే లావాదేవీల విషయంలో కూడా మరిన్ని ఫీచర్స్‌ను జోడించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. దీని వల్ల మోసాలు జరుగకుండా ఉండేందుకు సెక్యూరిటీగా ఈ ఫీచర్‌ను తీసుకురానుంది. అయితే మిమ్మల్ని ఎవరైనా క్యూఆర్‌కోడ్‌ పంపుతూ, SMS లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతుంటే ఓటీపీ నంబర్‌ ఎంటర్ లావాదేవీలు జరిగేందుకు ఆస్కారం ఉండాకుండా పటిష్ట భద్రతతో పీఛర్‌ను తీసుకురానుంది.

Tags:    

Similar News