భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఈరోజు దేశంలో భారీగా బంగారం,వెండి ధరలు పెరిగాయి
ఈరోజు దేశంలో భారీగా బంగారం,వెండి ధరలు పెరిగాయి. బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,100 పెరిగి 1,35,280 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,000 ఎగబాకి 1,24,000 రూపాయలు పలుకుతోంది.
అంచనాలు తలకిందులు చేస్తూ...
అటు కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,31,000కు చేరింది. వెండి ధర 3 రోజుల్లోనే పది వేల రూపాయలు పెరిగింది. గత కొద్ది రోజుల నుంచి ధరలు తగ్గుతుండటంతో వచ్చే వారం ధరలు మరింత తగ్గుతాయని అంచనాలు వినిపించాయి. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ భారీగా ధరలు పెరగడం ఆందోళనకు దారి తీస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.