Gold and Silver Prices : నేడు కూడా భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో భారీగా బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి

Update: 2026-01-31 07:12 GMT

అంతర్జాతీయ మార్కెట్లో భారీగా బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. బంగారం, వెండి ధరలు రెండో రోజు కూడా భారీగా పడిపోయాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఈరోజు కూడా అదే పతనం కొనసాగింది. దీంతో నిన్నటి వరకూ బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని వారు ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టిన ధరలను చూసి కొంత కొనుగోలు చేసే అవకాశముంటుందని అంటున్నారు.

ఈ ఒక్కరోజే...
ఈ ఒక్కరోజే తగ్గిన తులం బంగారం ధర 19,750 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,653 గా ఉంది. ఒక్కరోజే 10 శాతం బంగారం ధర తగ్గింది. ఇక ఒక్కరోజే కిలో వెండి 1,07,971కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో 34 శాతం వెండి ధరలు పడిపోయాయి.


Tags:    

Similar News