Gold Price Today : వావ్.. గుడ్ న్యూస్.. బంగారం ధర ఇంకా దిగి వస్తుందా?

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని హెచ్చరికలు తప్పవుతున్నాయి.

Update: 2025-10-25 03:39 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని హెచ్చరికలు తప్పవుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. పతనం దిశగా పసిడి పరుగులు పెడుతుంది. బంగారం తో పాటు వెండి ధరలు కూడా పెరుగుతాయని నిన్న మొన్నటి వరకూ అంచనాలు వినిపించాయి. కొనుగోళ్లు కూడా తగ్గిపోయాయి. పది గ్రాముల బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేసింది. అలాగే కిలో వెండి ధర రెండు లక్షల రూపాయలను దాటేసింది. దీంతో ఇంకెంత ధరలు పెరుగుతాయోనన్న ఆందోళన వినియోగదారుల్లో చోటు చేసుకుంది. ఇక బంగారం, వెండి వస్తువులు తమకు దూరమయినట్లేనన్న భావనకు చాలా మంది ఫిక్స్ అయిపోయారు.

ఎన్నడూ లేని విధంగా...
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రతి రోజూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రేంజ్ లో ధరలు పెరగడం తాము ఎన్నడూ చూడలేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు. సీజన్ తో సంబంధం లేకుండా ధరలు పెరిగాయన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా జరుగుతుండటంతో ధరలు ఇంకా పెరుగుతాయని, ఇప్పుడే కొనుగోలు చేయాలని చాలా మంది బిజినెస్ నిపుణులు సూచించారు. వారి మాటలను నమ్మి ఎక్కువ మంది బంగారం, వెండి పై ఇన్వెస్ట్ చేశారు. అయితే గత నాలుగు రోజులు నుంచి వరసగా ధరలు దిగివస్తున్నాయి. భారీగా బంగారం పతనం దిశగా పయనిస్తుంది. దీంతో త్వరలో తిరిగి పసిడి అందుబాటులోకి వచ్చే అవకాశముందనిపిస్తుంది.
ఈరోజు ధరలు...
పెట్టుబడి పెట్టేవారు సయితం ఒకింత ఆలోచనలో పడ్డారు. ధరలు తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడం శ్రేయస్కరం కాదని, సురక్షితమైన పెట్టుబడి కాదని నమ్ముతున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,13,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,24,360 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,69,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు మరింత పెరిగే అవకాశముంది.



Tags:    

Similar News