Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ధరలు ఇంకా పతనమవుతాయా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఈ ఏడాదిలో పెరిగినంత ఎప్పడూ పెరగలేదు. అనేక కారణాలతో బంగారం, వెండి ధరల్లో భారీగా పెరుగుదల కనిపించింది. దీంతో అమ్మకాలు కూడా దారుణంగా పడిపోయాయి. కొనుగోళ్లు నిలిచిపోవడంతో తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అయితే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో పాటు ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ నిర్ణయాలు, అదనపు సుంకాల వంటి వాటితో ఇటీవల కాలంలో ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరగడంతో వినియోగదారులు కూడా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి వెనకడుగు వేశారు.
భారీగా పెరిగి...
పది గ్రాముల బంగారం ధర త్వరలో లక్షన్నర రూపాయలకు చేరుకుంటుందని, కిలో వెండి ధర రెండు లక్షల రూపాయలకు పైగానే ఉంటుందన్న అంచనాలు వినిపించాయి. అంచనాలకు తగినట్లుగానే ధరల పెరుగుదల కనిపించింది. అయితే గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. భవిష్యత్ లో ఇంకా ధరలు తగ్గే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు బాగా పెరుగుతాయని ఇప్పటికే బంగారం, వెండిపై మదుపరులు ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. అయితే ధరలు పతనం కానుండటంతో వాటిని విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ ప్రభావం కూడా ధరలు తగ్గడానికి కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నేటి ధరలిలా...
పెళ్లిళ్ల సీజన్ తో పాటు శుభకార్యాలు కూడా జరుగుతుండటంతో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో ధరలు తగ్గితే అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయ ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,15,390 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,25,880 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,74,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.