Gold Rates Today : ఆదివారం తీపికబురు.. బంగారం ధరలు పెరగలేదుగా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.

Update: 2026-01-04 03:24 GMT

బంగారం ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎంతగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వెండి ధరలు బంగారాన్ని మించి పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే భారీగా పెరిగిన బంగారం ధరలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు చేయాలనుకున్న వారు కూడా అటువైపు చూడటం లేదు. పది గ్రాముల బంగారం ధర ఇప్పటికే లక్షన్నరదాటేసింది. అదే సమయంలో కిలో వెండి ధరలు రెండున్నర లక్షలదాటిపోయింది. ఇంతలా ధరలు పెరగడం గతంలో ఎన్నడూ జరగలేదు. ధరలను చూసి అసలు బంగారాన్ని చూసేందుకు కూడా వినియోగదారులు ఇష్టపడటం లేదంటే అతిశయోక్తి కాదు.

ఆందోళనలో జ్యుయలరీ దుకాణ యజమానులు...
బంగారం విషయంలో మహిళలు గతంలో భర్తలను కూడా లెక్క చేసేవారు కాదు. తాము చిన్న చిన్నగా పొదుపు చేసుకున్న మొత్తంతో బంగారాన్ని కొనుగోలు చేసేవారు. మరొకవైపు జ్యుయలరీ దుకాణాలు కూడా నెలవారీగా స్కీమ్ లు పెట్టేవి. నెలకు ఐదు వేలు కట్టినా ఏడాదికి అరవై వేలు మాత్రమే వస్తుంది. అంటే కనీసం పది గ్రాములు కాదు కదా.. ఐదు గ్రాముల బంగారం కూడా ఈ స్కీమ్ డబ్బులతో వచ్చే అవకాశాలు లేకపోవడంతో స్కీమ్ లు కట్టేవారు కూడా కనిపించడం లేదు. అదే సమయంలో వెండి ధరలు కూడా అదుపు లేకుండా పరుగులు తీస్తాయంటున్నారు. జ్యుయలరీ దుకాణాల యజమానులు ఈ ఏడాది కూడా అమ్మకాలు ఉండవనే ఆందోళనలో ఉన్నారు.
స్థిరంగా ధరలు...
ఈ ఏడాది ధరలు మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పెట్టుబడి పెట్టేవారు సయితం బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులను చూసి వెనుకంజ వేస్తున్నారు. దీంతో భారీగా అమ్మకాలు పడిపోయాయి.ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,24,500 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,35,820 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 2,57,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.





Tags:    

Similar News