Gold Price Today : భారీగా పెరిగిన బంగారం...అందుకోలేనంత దూరంలో వెండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది

Update: 2026-01-03 03:54 GMT

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని ముందు నుంచి హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. గత మూడు రోజులు వరసగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగు అందుకున్నాయి. కొత్త ఏడాదిలోనైనా కొంత పసిడి ప్రియులకు ఊరట దక్కుతుందని భావించినప్పటికీ అలాంటి అవకాశం లేదని పెరుగుతున్న ధరలను చూస్తే అర్థమవుతుంది. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో గత కొన్ని నెలలుగా కొనుగోలుకు దూరమయిన వారు నూతన సంవత్సరం అయినా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి ధరలు వస్తాయని భావించారు. కానీ ధరలు మాత్రం దిగి రావడం లేదు. పై పైకి పెరుగుతూనే ఉండటం బంగారాన్ని కొనుగోలు చేసే వారికి ఆందోళన కలిగిస్తుంది.

ఆఫర్లు ప్రకటిస్తున్నా...
జ్యుయలరీ దుకాణాల యజమాన్యం ఇప్పటికీ ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తూ ఊరిస్తుంది. తగ్గింపులోనూ, మజూరీలోనూ భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. అలాగే తమ ప్రియమైన కస్టమర్లకు స్పెషల్ ఆఫర్లను ప్రకటించినప్పటికీ బంగారం కొనుగోళ్లపై ఆసక్తి కనపర్చడం లేదు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చన్న భావనలో ఎక్కువ మంది ఉన్నారు. మరొకవైపు బంగారం, వెండి అనేది కేవలం అలంకారం కోసమే వినియోగించేది. అలాగే సెంటిమెంట్ కూడా కావడంతో అవసరమైతే తప్ప కొనుగోలు చేయరు. తప్పనిసరిగా కొనుగోలు చేయాలన్న రూల్ ఏమీ లేకపోవడంతో బంగారానికి చాలా మంది దూరంగా ఉంటున్నారు. పెట్టుబడి పెట్టేవారు మాత్రం కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.
నేటి ధరలు ఇలా...
బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం ఇప్పుడు ఆషామాషీ కాదు. ఎందుకంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అసాధ్యమైన విషయం. అందుకే బంగారం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగరాం ధరపై 1100 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై నాలుగు వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,24,860 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 1,36,210 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,60,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.





Tags:    

Similar News