Gold Price Today : బంగారం ఇక కొనడం కష్టమే.. వెండి తాకాలంటే భయమే

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగ పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది

Update: 2025-12-26 03:34 GMT

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరల పరుగు ఆగడం లేదు. ప్రతి రోజూ ధరలు పెరుగుతూ వినియోగదారులను పసిడికి దూరం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ కొన్ని వేల రూపాయలు పది గ్రాముల బంగారంపై ధర పెరిగింది. బంగారంతో పాటు వెండి కూడా వేగంగా పరుగులు పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు చేరుకునే అవకాశాలున్నాయి. అలాగే కిలో వెండి ధర కూడా రెండున్నర లక్షలకు దగ్గరగా ఉంది. ఇలా బంగారం, వెండి ఒకదానికి ఒకటి పోటీ పడి పెరుగుతుండటంతో కొనుగోలు చేసే వారు మాత్రం కరువయ్యారు. అయినా ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు.

సామాన్యులకు దూరం...
సామాన్యులు ఇక బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితి ఇప్పటికే నెలకొంది. ఈ ఏడాదికి ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలింది. ఈ ఏడాది పసిడి ప్రియులకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఏడాది మొత్తం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ ధరలు పెరుగుతూ ఇబ్బంది పెడుతున్నాయి. అలాగని కొనుగోలు చేయాలంటే మధ్యతరగతి, వేతన జీవులకు సాధ్యం కాదు. కేవలం సంపన్నుల కు మాత్రమే బంగారం సొంతంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా ధరలు పెరుగుతుండటం ఇక తగ్గే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. వచ్చే ఏడాది కూడా బంగారం ధరలు చుక్కలు చూపించే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
నేటి ధరలు...
మరొకవైపు వెండి పై పెట్టుబడి పెట్టేవారు విపరీతంగా పెరిగారు. ఇటీవల కాలంలో వెండికి గిరాకీ పెరిగింది. దానిపై పెట్టుబడి పెట్టడానికి, కొద్దికాలంలోనే లాభాలను ఆర్జించడానికి ఇది ఉపయోగపడుతుందని నమ్మి కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగ పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,27,660 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,39,260 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,45,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.





Tags:    

Similar News