Gold Rates Today : గోల్డ్ పై పెట్టుబడి పెట్టేవారికి అలెర్ట్... ఇప్పుడే అమ్మితే ఇక అంతే
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండిధరల్లో కూడా కొంత పెరుగుదల కనిపించింది.
బంగారం ధరలు దిగి రాక తప్పదు. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలతో డిమాండ్ తగ్గింది. దీంతో ధరలు తగ్గుతాయని అందరూ అంచనా వేశారు. భారీగా పతనం అవుతాయని మార్కెట్ నిపుణులు కూడా చెప్పారు. తొందరపడి బంగారంపై పెట్టుబడి పెట్టవద్దంటూ బిజినెస్ నిపుణులు కూడా సూచించారు. అయినా సరే బంగారం ధరలు తగ్గవని భావించి అనేక మంది కొనుగోలు చేశారు. వెండి ధరలు రెండు లక్షల రూపాయలు కిలో దాటడంతో దానిపై కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. అయితే ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు తగ్గిపోవడంతో కొనుగోలు చేసిన వారు ఇటు వాటిని అమ్మలేరు. అమ్మితే నష్టాన్ని కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే ధరలు మళ్లీ పెరిగే వరకూ వెయిట్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పట్లో భారీ పెరుగుదలకు...
అయితే అందుతున్న సమాచారం, జరుగుతున్న పరిణామాలను చూస్తే ధరలు అంతగా పెరిగే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ తారాజువ్వలా పైకి ఎగిసిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు భూచక్రంలా కిందనే తిరుగుతున్నాయి. దీంతో పెట్టుబడి పెట్టిన వారు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలని భావిస్తున్నారు. మరొకవైపు కొంత ధరలు దిగిరావడంతో కొనుగోళ్లు కొంత పెరిగాయి.మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ తో పాటు శుభకార్యాలు కూడా జోరుగా జరుగుతుండటంతో అమ్మకాలు గతంలో కంటే పెరిగాయని, అయితే ఆశించిన స్థాయిలో మాత్రం కొనుగోళ్లు పెరగలేదని జ్యుయలరీ దుకాణాల యజమానులు అంటున్నారు. మరికొంత కాలం ధరలు పెరగవన్న మాట.
కొద్దిగా పెరిగి...
బంగారం అంటే అందరికీ ఇష్టమే. అందులోనూ భారత్ లో బంగారం అంటే మరింత ఇష్టపడతారు. ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా అవసరమైన బంగారం, వెండి వస్తువులను సమకూర్చుకునేందుకు సిద్ధపడతారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండిధరల్లో కూడా కొంత పెరుగుదల కనిపించింది. పది రూపాయలు మాత్రమే పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,12,210 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,22,410 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,66,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు పెరగవచ్చు. తగ్గవచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు.