Gold Price Today : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నేటి ధరలు ఎంతంటే?
ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
బంగారం అంటే అందరికీ ఇష్టమే. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. భారత్ లో అత్యధికంగా బంగారం, వెండి విక్రయాలు జరుగుతాయి. ప్రపంచంలో బంగారం పై మక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ మంది గోల్డ్ బాండ్స్ ను కొనుగోలు చేస్తారు. బంగారాన్ని కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో.. దానిని భద్రపర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఎక్కువ మంది ఇటీవల కాలంలో గోల్డ్ బాండ్స్ ను కొనుగోలు చేస్తున్నారు. అయితే భారత్ లో మాత్రం సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి గోల్డ్ బాండ్స్ కంటే ఎక్కువగా బంగారం, వెండి ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు.
గతంలో అందుబాటులో...
బంగారం అంటే గతంలో ధరలు అందుబాటులో ఉండేవి. కొనుగోలు సామర్థ్యం మేరకు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసేవారు. అయితే రాను రాను బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల బంగారం అమ్మకాలపై కూడా ప్రభావం చూపాయని చెప్పక తప్పదు. అంతర్జాతీయంగా మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు సుంకాల నేపథ్యంలో ఇటీవల కాలంలో భారీగా బంగారం ధరలు పెరిగాయి. బంగారం లక్ష ఇరవై వేలు దాటి తిరిగి దిగి వచ్చింది. కిలో వెండి ధర రెండు లక్షలకు పైకి ఎగబాకి తిరిగి లక్షన్నరకు చేరువయింది.
స్వల్పంగా తగ్గినా...
పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతుండటంతో బంగారం, వెండి విక్రయాలు భారత్ లో ఎక్కువగా జరుగుతున్నాయి. అదే సమయంలో ధరలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో వినియోగదారులు కూడా ధరలు ఇంకా తగ్గుతాయేమోనని కొంత ఎదురు చూస్తున్నారు. ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల ధరపై పది రూపాయలు త్గగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,11,340 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,21,470 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర ప్రస్తుతం 1,50,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.