Gold Price Today : తీపికబురు.. సంక్రాంతికి ముందు మరింత గోల్డ్ రేట్స్ తగ్గుతాయట

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండిధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.

Update: 2025-10-29 03:25 GMT

బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత బంగారం విషయంలోనూ నిజమవుతున్నట్లే కనిపిస్తుంది. పది గ్రాముల బంగారం ధర త్వరలోనే లక్షన్నరకు చేరుకుంటుందని అంచనాలు వినిపించినా ప్రస్తుతం చూస్తుంటే ఆ పరిస్థితి కనిపిండం లేదు. బంగారం ధరలు గత కొద్ది రోజులుగా ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి. భారీగా కొన్నిసార్లు, స్వల్పంగా మరికొన్నిసార్లు తగ్గుతూ ఇక పెరగనని పరోక్షంగా బంగారం చెప్పినట్లయింది. ఒకవేళ బంగారం ధరలు పెరిగినా గతంలో మాదిరిగా భారీగా పెరిగే అవకాశం లేదని మాత్రం మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే బంగారానికి ఇటీవల కాలంలో డిమాండ్ కూడా తగ్గిందని అంటున్నారు.

అదుపులోకి రావడం...
బంగారం ధరలు అదుపులోకి రావడం సంతోషకరమైన విషయమే. చాలా మంది బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పది రోజుల వ్యవధిలోనే బంగారం ధరలు పది శాతం వరకూ తగ్గాయి. వెండి ధరలు కూడా కిలో రెండు లక్షల రూపాయలు దాటేసి మళ్లీ లక్షా యాభై వేలకు పడిపోయింది. అంటే దాదాపు పది రోజుల్లోనే కిలో వెండి ధర యాభై వేల రూపాయలు తగ్గింది. ఇది వినియోగదారుల కోణంలో చూస్తే మంచి పరిణామమే. అయితే పెట్టుబడి పెట్టిన వారు మాత్రం ధరలు పతనం అవ్వడంతో కొంత నష్టం చూడాల్సి వస్తుంది. అయితే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. వెండి ధర రెండు లక్షలు దాటడంతో ఇంకా పెరుగుతుందని ఎక్కువ మంది వెండిపై పెట్టుబడి పెట్టారు.
నేటి ధరలు...
అందులోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటం, శుభకార్యాాలు జరుగుతుండటంతో బంగారం ధరలు తగ్గుతుండటం కొనుగోలు దారులకు ఊరట కలిగిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే బంగారం పది గ్రాములు లక్ష రూపాయలకు చేరుకునే రోజు ఎంతో లేదంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండిధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. వెండి ధర మరింత తగ్గే అవకాశముందని చెబుతున్నారు. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,10,740 రూపాయలకు చేరకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,20,810 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,64,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.


Tags:    

Similar News