Gold Price Today : గుడ్ న్యూస్ .. భారీగా తగ్గిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి.

Update: 2025-10-24 05:18 GMT

బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తిగి వస్తున్నాయి. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. బంగారం, వెండి వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ఆ ప్రభావం అమ్మకాలపై పడింది. అంతే కాదు.. అదేసమయంలో బంగారం కొనుగోలు చేయడానికి మధ్యతరగతి, వేతనజీవులు వెనుకంజ వేశారు. దీంతో బంగారం, వెండి కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి ధరలు భారీగా తగ్గుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. అంచనాలకు తగినట్లుగానే ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి.

కొనుగోళ్లు పెరగడంతో...
ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా కొనుగోలు చేసేవారు కొందరున్నారు. పెట్టుబడి పెట్టి తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్ని గడించేందుకు ఎక్కువ మంది బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టారు. అయితే అంతర్జాతీయ ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు ఆగిపోవడం, ట్రంప్ నిర్ణయాలు, అమెరికా విధించిన అదనపు సుంకాలతో ఇటీవల వరకూ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో ధరలు భారీగా పతనమవుతాయని కొందరు ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు. బంగారంపై పెట్టుబడి సురక్షితమని భావించి కొనుగోలు చేయడంతో డిమాండ్ కూడా భారీగా పెరిగింది.
స్వల్పంగా తగ్గి...
పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తుండటంతో బంగారం ధరలు పెరిగినా కొనుగోళ్లు కొంత తగ్గినా పూర్తిగా తగ్గలేదు. అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు క్రమంగా వినియోగదారులకు చేరువవుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర కూడా తగ్గింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,14,640 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,25,070 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,73,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News