Gold Rates Today : ఈరోజు మరొకసారి పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి

Update: 2025-10-17 07:46 GMT

బంగారం ధరలు భారీగా పెరిగాయి. లక్షా ముప్ఫయి ఐదు వేలకు చేరుకోవడంతో బంగారం కొనుగోలు చేసేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులోనే పది గ్రాముల బంగారం ధరపై 2,442 రూపాయలు పెరిగి ఆల్‌టైమ్‌ హైని నమోదు చేసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో సేఫ్‌ హేవన్‌ డిమాండ్‌ పెరగడం వల్ల ఈ పెరుగుదల చోటు చేసుకుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి.

కొత్త రికార్డుల దిశగా...
బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అమెరికాలో సంభవించే క్రెడిట్‌ సంక్షోభ భయం, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గించే అంచనాలు ధరలను మరింతగా పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి వెండి ధరల్లోనూ కనిపించింది. కిలో వెండి ధరపై 2,752 రూపాయలు పెరిగి,70,415 చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం భారీగా పెరిగింది. రానున్నవి పండగ సీజన్ తో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు.
పెట్టుబడి పెట్టేవారు.
ఈరోజు ఉదయానికి మధ్యాహ్నానికి బంగారం ధరలు మరింత పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,35,250 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,21,725 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,81,000 రూపాయలకు చేరుకుంది. అతి త్వరలోనే బంగారం ధర లక్షన్నర కు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపిస్తుందంటున్నారు. మదుపరులు ఎక్కువగా బంగారం, వెండి పెట్టుబడి పెట్టడం వల్ల కూడా ధరల పెరుగుదలకు కారణమని అంటున్నారు.
Tags:    

Similar News