Gold Rates Today : గుడ్ న్యూస్... నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర స్వల్పగా తగ్గింది

Update: 2026-01-05 03:58 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. వాటి ధరలు తగ్గుతున్నాయని చెబితే అది శుద్ధ అబద్ధమే అవుతుంది. ఒకసారి పెరిగిన బంగారం ధర మామూలు స్థితికి చేరుకునే పరిస్థితి అనేది ఉండదు. గత కొన్ని దశాబ్దాలుగా బంగారం ధరలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. 1960లో పది గ్రాముల బంగారం ధర ఎంత ఉంది? 2000లో ఆ ధర ఎంతకు పెరిగింది.. 2026 నాటికి బంగారం ధర ఎంతకు చేరింది? అన్నది తెలుసుకుంటే చాలు బంగారం ధరల విషయంలో ఉన్న అపోహలన్నీ తొలిగిపోతాయి. అందుకే బంగారం ధరలు ఒక్కసారి పెరిగితే ఒక తగ్గుతుందని, మనకు అందుబాటులోకి వస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుందని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు.

ధరలు పెరిగినా...
బంగారం ధరలు ఎంత పెరిగినా కొనుగోలు చేసే వారు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే బంగారం, వెండి అనేది మనకు అవసరం కాకపోయినా, నిత్యవసరాలు కాకున్నప్పటికీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైనందున ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలకు బంగారం, వెండి కొనుగోళ్లు తప్పనిసరి అయ్యాయి. ముఖ్యంగా పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. వధువుకు బంగారాన్ని ఇవ్వడం వారి తల్లిదండ్రులకు ఆనవాయితీగా మారింది. మరొకవైపు ఇప్పుడు పెళ్లిళ్లలో కట్న కానుకల్లో బంగారాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయి. వచ్చే నెల నుంచి తిరిగి ముహూర్తాలు వస్తుండటంతో బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు.
వెండి స్వల్పంగా తగ్గి...
పెట్టుబడి పెట్టేవారికి కూడా బంగారం, వెండిపై మదుపు చేయాలంటే భయపడిపోతున్నారు. ఒక్కసారి పతనమవుతుందేమోనని ఆందోళనతో వారు పెట్టుబడి పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర స్వల్పగా తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,24,490 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,35,810 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర 2,56,900 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.


Tags:    

Similar News