Gold Price Today : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ పనిచేయండిక

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది

Update: 2026-01-09 03:23 GMT

బంగారం ధరలు కొనుగోలు దారులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ధరలు తగ్గుతాయన్న మాట అవాస్తవం. తగ్గినప్పటికీ ధరలు అందుబాటులోకి మాత్రం రావు. బంగారం అనేది ఒక సెంటిమెంట్. సంప్రదాయాలకు, సంస్కృతికి బంగారం, వెండి అనేది కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. తరతరాల నుంచి బంగారం అంటే ఇష్టపడని వారు లేరు. జనరేషన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేసేది ఒక్క బంగారం, వెండి మాత్రమే. మిగిలిన వస్తువులపై ఇష్టాఇష్టాలు.. జనరేషన్ లను బట్టి మారతాయి. కానీ బంగారం విషయంలో మాత్రం ఆలోచించరు. వెండి విషయంలోనూ అంతే జరుగుతుంది. బంగారం, వెండి అంటే పడి చచ్చే వారు అందరూ ఉంటారు. అందులో ఏ మాత్రం ఎక్కువ, తక్కువ ఉండవు.

భారతీయులకు బంగారం...
అందులోనూ భారతీయులకు బంగారం అంటే ఎనలేని ప్రేమ. బంగారానికి, భారతీయులకు ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. పురాతన కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ బంధం ఎన్నడూ తెగిపోదు. తెగిపోయే అవకాశం లేదు. అందుకే బంగారం, వెండి వస్తువులకు భారత దేశంలో విపరీతమైన డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే బంగారం ధరలు ఎప్పుడూ దిగి రావడం అనేది జరగదు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల, ట్రంప్ విధించిన సుంకాలు, విధించబోయే అదనపు సుంకాలు వంటి కారణాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపనున్నాయి. ధరలు తగ్గాయంటే కొద్దిగా మాత్రమే.
నేటి ధరలు...
పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుంది. వచ్చే నెల నుంచి ఇక శుభముహూర్తాలు ఉన్నాయి. ఇక బంగారం కొనుగోళ్లు కూడా భారీగా పెరిగే అవకాశాలున్నాయి. కొనుగోళ్లతో పాటు ధరలు కూడా పెరగనున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,26,500 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,37,990 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,71,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News