Gold Rates Today : గుడ్ న్యూస్.. భారీగా పతనమయిన బంగారం ధరలు.. వెండి కూడా

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది.

Update: 2025-12-31 03:31 GMT

కొత్త ఏడాది ప్రవేశించకముందు బంగారం, వెండి ధరలు కొంత దిగి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగి వస్తున్నాయి. సోమవారం నుంచి ధరల తగ్గుదల ప్రారంభమయింది. అయితే కొత్త ఏడాదిలో ధరలు మరింత తగ్గుతాయా? లేక మరింతగా పెరుగుతాయా? అన్నది తెలియాల్సి ఉంది. బంగారం, వెండి విషయంలో అంచనాలను వేయలేని పరిస్థితి ఉంది. ఒక దేశంలో జరిగే పరిణామాలతో జరిగే మార్పులు కావు. అంతర్జాతీయంగా జరిగే అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతుంది. అందుకే బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని పదే పదే మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు.

మరింతగా తగ్గుతాయని...
మరింతగా ధరలు తగ్గుతాయని వేచి చూడటం అవివేకమని చెబుతారు. ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. అనేక కారణాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అమెరికాలో ఫెడరల్ రేట్లు వంటివి బంగారం, వెండి ధరలలో మార్పులకు కారణమవుతాయని అంటారు. ఈ ఏడాది మొత్తం పసిడి ప్రియులకు బంగారం, వెండి చుక్కలు చూపించింది. వెండి భారీగా పెరుగుతుందని భావించి దానిపై పెట్టుబడి పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు దానిని ఉంచుకోలేక, అమ్ముకోలేక సతమతమయ్యే పరిస్థితి ఏర్పడింది. అందుకే బంగారం, వెండి ధరలు లాటరీ తో పోల్చవచ్చంటారు. ః
నేటి ధరలు ఇలా...
మరో నెలన్నర పెళ్లిళ్ల సీజన్ కూడా లేదు. అయినా సీజన్ తో సంబంధం లేకుండా పెరిగేది, తగ్గేది బంగారం, వెండి మాత్రమే. అందుకే కొనుగోలు చేయదలచుకున్న వారు ధరలు తగ్గిన వెంటనే కొనుగోలు చేస్తే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై మూడు వేల రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై పద్దెనిమిది వేల రూపాయలు తగ్గింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,24,840 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,36,190 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,57,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. అయితే ఇంకా ధరలు అందుబాటులోకి రాలేదు. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.




Tags:    

Similar News