Gold Price Today : గుడ్ న్యూస్.. పసిడి.. ధరలు అందుబాటులోకి రానున్నాయా?
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు తగ్గుతున్నాయి. పతనం దిశగా బంగారం పయనిస్తుంది. నిన్న మొన్నటి వరకూ ప్రతి రోజూ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు కూడా అదుపులో లేకుండా భారంగా మారాయి. కానీ గత కొద్ది రోజుల నుంచి బంగారం, వెండి ధరల పతనం క్రమంగా ప్రారంభమయింది. అయితే ఇంకా ధరలు ఇంకా అందుబాటులోకి రాలేదని వినియోగదారులు అంటున్నారు. మరింత ధరలు తగ్గుతాయని కొనుగోలు కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ధరలు భారీగా పతనమవుతాయని గతంలోనే మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే అంచనాల మేరకు తగ్గకపోయినా ధరలు మాత్రం ప్రస్తుతం దిగి వస్తుండం కొంత ఊరట కల్గించే అంశమేనని చెప్పాలి.
పతనమవ్వడానికి...
ధరలు పతనమవ్వడానికి బంగారానికి డిమాండ్ కూడా తగ్గడం ఒక కారణమని చెబుతున్నారు. బంగారం పై పెట్టుబడి పెట్టేవారు కూడా తగ్గారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని ధరలు బాగా ఉన్నప్పుడే విక్రయించాలని భావించడంతో బంగారం నిల్వలు అందుబాటులోకి రావడంతో ఆ ప్రభావం ధరలపై పడిందని అంటున్నారు. మరికొంత కాలం ఈ పతనం ఉంటుందని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ట్రేడ్ వర్గాలు కూడా అందరికీ అందుబాటులో బంగారం, వెండి ఉన్నప్పుడే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయని చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు కూడా బంగారం ధరలు పతనమవ్వడానికి మరొక ప్రధాన కారణంగా చెబుతున్నారు.
డిమాండ్ తగ్గడంతో...
పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతుండటంతో కొంత మేరకు డిమాండ్ ఉన్నప్పటికీ ధరలు మాత్రం ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చన్న భావనలో ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదయిన హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,12,990 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,23,270 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,69,900 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరగవచ్చు.