Gold Price Today : ముట్టుకుంటే షాక్ ...భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగియో తెలిస్తే?

ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర స్వల్పంగా పెరిగింది

Update: 2025-09-10 03:34 GMT

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. చివరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా లక్ష రూపాయలు దాటేసింది. దీంతో బంగారం అనేది ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉంది. ఇంతలా ధరలు పెరుగుతుండటంతో కొనుగోళ్లు దారుణంగా పడిపోయినా ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. బంగారం, వెండి వస్తువులను సొంతం చేసుకోవాలని అందరికీ ఉంటుంది. తమకు ఉన్న స్థోమతలో కొనుగోలు చేయాలని భావిస్తారు. కానీ ఊహించని రీతిలో ధరలు పెరుగుతుండటంతో బంగారం చేదు అయిందనే చెప్పాలి. ఇప్పుడు బంగారం వైపు చూడాలంటేనే భయమేసేటంత ధరలు పెరిగాయి. ఈ ప్రభావం ఖచ్చితంగా అమ్మకాలపై చూపుతుందని జ్యుయలరీ దుకాణాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనేక కారణాలతో...
బంగారం ధరలు అనేక కారణాలో పెరుగుతూనే ఉన్నాయి. డాలర్ తో రూపాయి ధర తగ్గుదల, పెట్టుబడిదారులు కూడా సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, పెంచిన సుంకాలు, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు ఈ ఏడాది భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తుండటంతో పెళ్లిళ్ల సీజన్ అయినా ఆశించిన రీతిలో అమ్మకాలు జరగడం లేదు. దీంతో ఇక బంగారం అనేది కేవలం అలంకారానికి కొనుగోలు చేయరని, సెంటిమెంట్ గా కూడా భావించరని, మరొక ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూసే అవకాశముందన్న అంచనాలు వినిపడుతున్నాయి.
భారీగా పెరిగి...
అలాగని బంగారం ధరలు తగ్గుతాయని చెప్పలేమంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇంకా పెరిగే అవకాశముందని, వాటి ధరల పెరుగుదల ఎవరి చేతుల్లో ఉండదని కూడా అంటున్నారు. అందుకే బంగారం ధరలు ఇలా ఊహించని స్థాయిలో పెరిగాయి. ఈ ఏడాదిలోనే కొన్ని వేల రూపాయల ధర పెరిగింది. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,10,300 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,39,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి వీటి ధరల్లో మార్పులు ఉండవచ్చు.


Tags:    

Similar News