Gold Prices Today : పసిడి ధరలు ఇంకా పెరుగుతాయట.. దీనికి కారణాలు కూడా ఇవే

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి.

Update: 2024-04-02 02:43 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి. పసిడి ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండనుందని అంచనాలు వినపడుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత బంగారం మరింత ప్రియమవుతుందని కూడా కొన్ని అంచనాలు కొనుగోలుదారులను భయపెడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణాలు అనేకం.

పతనం అవుతుందని...
మదుపరుల మెరుగైన వస్తువుగా బంగారం మారిపోయింది. పసిడి పతనం అవుతుందని వచ్చిన అంచనాలు మాత్రం ఎప్పుడూ తలకిందులు అవుతూనే ఉంటాయి. ఒకనాడు అలంకార వస్తువుగా ఉండే బంగారం నేడు అవసర వస్తువుగా మారింది. అంతే కాదు.. స్టేటస్ సింబల్ గా కూడా మారడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. రానున్న కాలంలో పది గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయికి చేేరుకునే దిశగా పరుగులు పెడుతున్నాయి.
పెరిగిన ధరలు...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,610 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,390 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 81,700 రూపాయలు పలుకుతుంది.



Tags:    

Similar News