Gold Prices Today : అక్షర తృతీయకు ఇంకా ధరలు అదిరిపోతాయట.. అందుకే క్యూ కడుతున్నారు

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి

Update: 2024-05-08 03:06 GMT

బంగారం ధరలు మరింత ప్రియమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కంటి ముందే ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం కొనుగోలు చేయడం ఆపడం లేదు. మూఢమి వచ్చిందని బంగారం, వెండి ధరల కొనుగోళ్లను నిలిపివేయలేదు. ఇప్పుడు కొంటే మరీ మంచిదని, రానున్న కాలంలో మరింత ధరలు పెరుగుతాయన్న మార్కెట్ నిపుణుల హెచ్చరికతో బంగారం, వెండి ధరలను కొనుగోలు చేసేందుకు జ్యుయలరీ షాపులకు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు.

మూఢమి మూడు నెలలు...
మూఢమి మూడు నెలల పాటు ఉంటుంది. ముహూర్తాలు లేవు. పెళ్లిళ్లు ఇక మూడు నెలలు జరగవు. అయినా సరే బంగారం, వెండి కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. ఈ నెలలో అక్షర తృతీయ ఉండటంతో ఆరోజు కొత్త నగలను దేవుడి ఎదుట ఉంచి పూజలను నిర్వహించుకోవడం కోసం ఇప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నారు. జ్యుయలరీ దుకాణాలు కూడా ఆఫర్లు ప్రకటిస్తుండటంతో తాకిడి మరింత ఎక్కువయింది. అక్షర తృతీయ ఆఫర్లతో ప్రకటనలు హోరెత్తిపోతున్నాయి. దీంతో వినియోగదారులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు.
స్వల్పంగా పెరిగినా...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. స్వల్పంగా పెరిగాయన్న మాటే కానీ రానున్న కాలంలో మరింత ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆఫర్లు ఉన్నప్పుడే కొనుగోలు చేయాలని తపన పడుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,360 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,390 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 88,600 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News