Gold Prices Today : ఇలా ధరలు పెరుగుతూ పోతే ఎలా.. కొనుగోలు చేసేది కష్టమేనా?

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి.

Update: 2024-03-22 03:31 GMT

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఎంత బ్యాడ్ న్యూస్ అంటే.. ధరలు పెరుగుతున్నాయి. ఇక పెరగడమే కాని.. తగ్గడం అరుదుగా జరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పసిడి ధరలు తగ్గుతాయని భావించిన వాళ్లకు ఇబ్బంది పెట్టేలా ధరలు కనిపిస్తున్నాయి. ఇలా ధరలు పెరుగుతూ పోతే ఇక కొనుగోలు చేయాలంటే ఎలా? అన్న ఆందోళన గోల్డ్ లవర్స్ లో ఉంది. భవిష‌్యత్ లో బంగారం కొనుగోలు చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనన్న ఛలోక్తులు వినిపిస్తున్నాయి.

ఎప్పుడూ అంతే...
బంగారం ధరలు ఎప్పుడూ అంతే. అమాంతం పెరుగుతాయి. సీజన్ తో సంబంధం లేకుండా ధరలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది. మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం ధరలు అందుబాటులో ఉండకపోతుండటంతో ఆభరణాలను ఇక సొంతం చేసుకోవడం కష్టమేనని అంటున్నారు. కేవలం ధనికులకు మాత్రమే బంగారం సొంతంగా మారనుంది. అంతర్జాతీయంగా ధరల్లో వచ్చిన ఒడిదుడుకులు, విదేశీ మాంద్యం కారణంగా ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.
పెరగడం ప్రారంభిస్తే...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరగగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,810 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,430 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 81,600 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News