Gold Prices Today : టెంపరేచర్లే నయమిస్తుందిగా.. బంగారం ధరలతో పోల్చుకుంటే?

ఈరోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

Update: 2024-04-17 03:27 GMT

బంగారం ధరలకు బ్రేక్ పడటం లేదు. నిన్న పది గ్రాముల బంగారం ధరపై తొమ్మిది వందల రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయల వరకూ పెరిగింది. దీంతో పెళ్లిళ్ల సీజన్ ముగుస్తున్న సమయంలో బంగారం ధరలు మండిపోతున్నాయి. అనుకుంటున్నట్లుగానే ఈ ఏడాది బంగారం ధర లక్షకు చేరుకునే అవకాశాలున్నట్లు సూచనలు అయితే బలంగానే కనిపిస్తున్నాయి. పది గ్రాములు లక్ష రూపాయలు అయితే ఇక కొనుగోళ్లపై ఆ ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది చూడాల్సి ఉంది.

మరింతగా పెరిగే...
అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకుల కారణంగానే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయంటున్నారు. అమెరికా ఎన్నికలు జరిగిన తర్వాత మరింత ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇలా అనేక రకాలైన విశ్లేషణలు పుత్తడి ధర పెరుగుతుందే కానీ తగ్గుతుందని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. బంగారం లభ్యత అంతే ఉండటం.. కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుండటంతో డిమాండ్ పెరిగి దాని ధరలు అందకుండా పోతున్నాయనే వారు కూడా ఉన్నారు. బంగారం స్టేటస్ సింబల్ గా మారడంతో ఇక పేదల ఇంట పసిడికి చోటు లేకుండా పోయేటట్లే కనిపిస్తుంది.
ధరలు ఇలా...
ఈరోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు నేడు పెరిగింది. కిలో వెండి ధరలపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,960 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,140 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 90,600 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News