Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. కొద్దిగా తగ్గిన వెండి ధరలు

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

Update: 2025-10-06 03:25 GMT

బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి. ధరల్లో మార్పులు జరుగుతూ పెరుగుతూ పోవడమే తప్ప బంగారం ధరలు దిగిరావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. గత కొద్ది నెలల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే బంగారం ధరలు ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లాయి. ఈ రేంజ్ లో ధరలు పెరుగుతూ వినియోగదారులకు ప్రతిరోజూ షాకిస్తున్నాయి. ఏ రోజు కూడా తగ్గిన పాపాన పోలేదు. తగ్గినప్పటికీ పది గ్రాముల బంగారం ధరపై పదో పరకో తగ్గడమే కాని భారీగా తగ్గింది లేదనే చెప్పాలి. అందుకే 2025 సంవత్సరం ప్రారంభం నుంచి మొదలయిన బంగారం, వెండి ధరల పరుగు నేడు కూడా ఆగకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

కొనుగోళ్లు తగ్గినా...
బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే ధరలు పెరిగితే అంత డిమాండ్ ఉంటుందా? అంటే మధ్యతరగతి, వేతన జీవులు మాత్రం కొనుగోలు చేయరు. దీంతో అమ్మకాలు చాలా వరకూ తగ్గే అవకాశముంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు కూడా బంగారం కొనుగోలు చేయడాన్నిఇప్పటి వరకూ సంస్కృతి సంప్రదాయాలుగా భావించినప్పటికీ ధరలు విపరీతంగా పెరగడంతో బంగారం విషయంలో ప్రజలు కూడా పునరాలోచనలో పడాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే సీజన్ లో కూడా అమ్మకాలు ఊపందుకోలేదు. ఇక అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ నిర్ణయాలతో ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఈరోజు కూడా...
రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీపావళి పండగతో పాటు ధన్ తెరాస్ కూడా ఉండటంతో బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,09,440 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,390 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,64,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు కనిపించవచ్చు.



Tags:    

Similar News