Gold Rates Today : బంగారాన్ని భద్రపర్చుకోండి...కొత్తగా కొనలేకపోయినా.. ఉన్నదానిని అమ్ముకోకండి

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Update: 2025-09-27 04:20 GMT

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక మార్కెట్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పది గ్రాముల బంగారం ధర రెండు లక్షల రూపాయలకు చేరుకుంటుందని, త్వరలోనే ఆ వార్తను కూడా వింటామని చెబుతున్నారు. అందుకే ఆర్థిక స్థోమత ఉన్న వారు బంగారంపై పెట్టుబడి ఇప్పుడే పెడితే మంచి లాభాలు వస్తాయని చెబుతున్నారు. అదే సమయంలో పాత బంగారం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని, ఇప్పుడు అమ్ముకుంటే అలాంటి మేలిమి బంగారాన్ని ఇక భవిష్యత్ లో కొనుగోలు చేయలేమని కూడా చెబుతున్నారు. ఈ సమయంలో బంగారం అమ్మకాలు అంత శ్రేయస్కరం కాదని మార్కెట్ నిపుణులు పదే పదే చెబుతున్నారు.

భవిష్యత్ లో మరింతగా...
చాలా మంది తమ వద్ద ఉన్న బంగారాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించడం అవివేకమైన చర్యగా భావిస్తున్నారు. ఎందుకంటే బంగారాన్ని భవిష్యత్ లో కొనలేని పరిస్థితులు నెలకొంటాయని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, నిర్ణయాల ప్రభావం బంగారం ధరలపై పడుతుందని కూడా చెబుతున్నారు. దిగుమతులు కూడా తక్కువగా ఉండటంతో బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో కొత్తగా కొనలేకపోయినా.. ఉన్నవాటిని అమ్ముకోవద్దన్న సూచనలు బిజినెస్ నిపుణులు చెబుతున్నారు.
స్వల్పంగా పెరిగి...
పండగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంది. అదే సమయంలో వెండి ధరలు కూడా మరింత పెరిగే అవకాశముంది. ఈ సమయంలో పెట్టుబడికి బంగారం సురక్షితమని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,05,310 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,14,890 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,53,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News