Gold Rates Today : ట్రాక్ తప్పుతున్న గోల్డ్.. పరుగు ఎక్కడి వరకూ పోతుందో?

బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి.

Update: 2025-10-04 04:19 GMT

బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. ధరలు క్రమంగా పెరుగుతూ ఎవరికీ అందనంత స్థాయికి చేరుకున్నాయి. ఈ ధరలను చూసిబంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడి పోయే పరిస్థితి ఏర్పడింది. బంగారం ఒకప్పుడు సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి సెంటిమెంట్ గా భావించేవారు. కానీ నేడు బంగారం స్టేటస్ సింబల్ గా మారింది. బంగారు నగలు ధరించాలంటే సాధారణ మహిళలకు సాధ్యం కాదు. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే అది వీలవుతుంది. ఎందుకంటే తులం బంగారం కొనుగోలు చేయాలంటే లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. పది గ్రాముల బంగారం కొనుగోలు చేయాలన్నా జీఎస్టీ, తరుగు, ఎస్ఎస్టీ అంటూ అదనంగా వసూలు చేయడంతో బులియన్ మార్కెట్ ధరలు కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

బిల్లు లేకపోతే...
బంగారం, వెండి ధరలు మనదేశంలో ఉండే పరిస్థితులను బట్టి మార్పులుండవు. అంతర్జాతీయ మార్పులతోనే వాటి ధరల్లో మార్పులకు సంబంధం ఉంటుంది. భారత్ ఎక్కువగా దిగుమతిపైనే ఎక్కువగా ఆధారపడి ఉండటంతో ఈ పరిస్థితి కనిపిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే అమ్మకాలు భారీగా తగ్గడంతో జ్యుయలరీ దుకాణాల యజమానులు కొన్ని ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పన్నులు చెల్లించకుండా కొనుగోలు చేయాలంటే కొందరు వ్యాపారులు బిల్లులు ఇవ్వమని చెబుతున్నారు. దాని వల్ల మూడు శాతం జీఎస్టీ తగ్గుతుందని చెబుతున్నారు. అలా కొనుగోలు చేస్తే ఏదైనా సమస్య వస్తే తిరిగి ఎక్సేంజ్ చేసుకోవడానికి వీలుండకపోవడంతో ఎక్కువ మంది వినియోగదారులు బిల్లులు లేకుండా బంగారం, వెండిని కొనుగోలు చేయడానికి జంకుతున్నారు.
మళ్లీ పెరిగి...
మరొకవైపు పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా బంగారం బిస్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. తిరిగి ధరలు భారీగా పెరిగినప్పుడు వాటిని విక్రయించుకుని సొమ్ము చేసుకోవచ్చని భావిస్తున్నారు. దీపావళి పండగతో పాటు ధన్ తెరాస్ కూడా ఉండటంతో రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. ఈరో్జు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,08,640 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,520 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,61,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులుండే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News