Gold Price Today : భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి భగ..భగ

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

Update: 2025-12-27 03:53 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. ఈ రేంజ్ లో పెరుగుతుండటం పసిడి ప్రియులకు ఆనందం ఆవిరి చేస్తుంది. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారి ఆశలు నిరాశ ఎదురవుతుంది. ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎన్నడూ జరగలేదు. 2025 లో బంగారం ధరలు దాదాపు 70 శాతం మేర పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నాయి. అంటే ఎంత ధరలు పెరిగాయో చెప్పాల్సిన పనిలేదు. మరొకవైపు వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజు కిలో వెండి ధరపై తొమ్మిది వేల రూపాయలు పెరిగింది. పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు, కిలో వెండి ధర మూడు లక్షల రూపాయలకు చేరువలో ఉంది.

అందరికీ అందుబాటులో లేక...
బంగారం అంటే ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది. సామాన్యుల నుంచి మధ్యతరగతి, ఉద్యోగుల వరకూ బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి గతంలో ఉండేది కాదు. నాడు ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉన్నప్పటికీ బంగారం ధరలు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు కొనుగోలు శక్తి ప్రజల్లో పెరిగినప్పటికీ బంగారం కొనుగోలు చేసే స్థాయి మాత్రం ఎవరికీ లేకుండా పోయింది. బంగారం ధరలు ఇంతగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్బోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, దిగుమతులు తగ్గడం బంగారం ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు.
నేటి ధరలు పెరిగి...
ఇప్పుడు బంగారం కంటే వెండిపై పెట్టుబడి పెట్టేవారు అధికంగా కనిపిస్తున్నారు. తమ వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులను కూడా విక్రయించుకుని కొందరు ప్రయోజనం పొందుతున్నారు. వచ్చే ఏడాది కూడా ధరలు పెరుగుతాయన్న అంచనాలు వినిపడుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,28,360 రూపాయలకు చేరకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,40,030 రూపాయలుగా కొనసాగుుతుంది. కిలో వెండి ధర 2,54,100 రూపాయలుగా నమోదయింది. మధ్యాహ్నానికి ధరలు మరింత పెరిగే అవకాశముంది.


Tags:    

Similar News