Gold Price Today : తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటున్న బంగారం.. ఈ ధరలేంట్రా బాబూ?

. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి

Update: 2025-09-23 04:15 GMT

బంగారం ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వరసగా పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముదని మార్కెట్ నిపుణులు సయితం చెబుతున్నారు. పెరుగుతున్న బంగారం ధరలతో ఇప్పటికే వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత కొద్ది నెలల నుంచి ఇదే విధంగా అమ్మకాలు పడిపోయాయని జ్యుయలరీ దుకాణ యాజమాన్యం చెబుతుంది. బంగరాన్ని కొనుగోలు చేయాలంటే సాధారణ, మధ్యతరగతి, వేతన జీవులకు మాత్రం సాధ్యం అయ్యే పనికాదు. అందుకే బేరాలు లేవని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం చెబుతుంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇదే పరిస్థితి ఉందని వారు అంటున్నారు.

కొనుగోళ్లు ఎక్కువగా...
నిజానికి ఈ సీజన్ లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఎక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. కానీ బంగారం ధరలు ఈ ఏడాది నుంచి ప్రతి రోజూ ఎక్కువవుతుండటంతో పాటు పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైగానే ఉండటంతో కొనుగోలు దారులు ఆసక్తి చూపడం లేదు. పెళ్లిళ్లకు కూడా అవసరమైనంత మేరకే కొనుగోలు చేస్తున్నారని, గతంలో మాదిరిగా పెట్టిపోతలతో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో ధరలు పెరుగుతున్నాయి.
భారీగా పెరిగి...
ఇక బంగారంపై పెట్టుబడి పెట్టే వారు సయితం బంగారం కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. సురక్షితమైన పెట్టుబడుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటుండటంతో అమ్మకాలపై ప్రభావం భారీగానే పడింది. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,03,660 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,16,080 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెడి ధర 1, 48, 100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు కనిపించే అవకాశముంది. పెరగవచ్చు. తగ్గవచ్చు. స్థిరంగా కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News