Gold Price Today : బంగారాన్ని ఇక మర్చిపోవడమే మంచిదా... ఉన్నదానిని జాగ్రత్తగా పెట్టుకోండిక
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి
బంగారం ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి బంగారం ధరలు దిగి రావడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభమైన పెరుగుదల ఇప్పటి వరకూ ఆగలేదు. అంటే దాదాపు తొమ్మిది నెలల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదట్లో బంగారం కొనుగోలు చేసిన వారు ఒక రకంగా అదృష్టవంతులు. కానీ ఇప్పుడు అదే బంగారాన్ని కొనుగోలు చేయాలంటే లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండటంతో పాటు భారీగా పెరుగుదల ఉండటం కూడా వినియోగదారులను మాత్రమే కాదు వ్యాపారులను కూడా ఆందోళనకు గురి చేస్తుంది.
డిమాండ్ తో సంబంధం లేకుండా...
బంగారం ధరలు ఎప్పుడూ అంతే. అస్సలు డిమాండ్ తో సంబంధం లేకుండా పెరిగేది బంగారం ఒక్కటే. దిగుమతులు ఎక్కువగా ఉన్నా.. కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నా పెరగడం ఏ వస్తువుకైనా సహజం. కానీ బంగారం విషయం మాత్రం అలా కాదు. డిమాండ్, సీజన్ తో నిమిత్తం లేకుండా పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలు కూడా బంగారం ధరలను ఎక్కువగా ప్రభావం చేస్తాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలతో బంగారం ధరలు మరింత పెరిగాయన్నది మార్కెట్ నిపుణుల అంచనాగా వినిపిస్తుంది.
స్థిరంగా ఉన్నా...
పెట్టుబడి పెట్టేవారు కూడా బంగారంపై పెట్టడం మానేశారు. మరొక సురక్షితమైన వాటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారం, వెండి కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారుల కొనలేరు. జ్యుయలరీ దుకాణాల్లో ఉన్న స్టాక్ అమ్ముడు పోవడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 కయారెట్ల పది గ్రాముల బంగారం ధర 101,900 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,11,170 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,43,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.