Gold Price Today : షాక్ లు మీద షాక్ లు ఇస్తున్న గోల్డ్...పెరగనిదే పొద్దు గడవదులా ఉందిగా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజలకు ఇప్పటికే బంగారం దూరమయింది. వేతన జీవులు సయితం బంగారాన్ని కొనుగోలు చేయడానికి వెనకంజ వేస్తున్నారు. కేవలం సంపన్న వర్గాలు మాత్రమే ఇక బంగారం పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉన్నదంతా ఊడ్చి పెట్టి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే బంగారం అవసరమైన సమయంలో ఆదుకుంటుంది కానీ, అదే సమయంలో డబ్బంతా బంగారం పై పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. అందుకే ఇప్పుడున్న ధరలతో బంగారం కొనుగోళ్లకు మధ్యతరగతి, వేతనజీవులు దూరమయ్యారు.
ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు...
బంగారం విషయంలో అందరికీ ఒక అభిప్రాయం ఉంది. బంగారం కొనుగోలు చేస్తే నష్టం ఉండదని, నిజమే.. బంగారం సురక్షితమైన పెట్టుబడి కావచ్చు. కానీ ముందుగా పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి బంగారాన్ని కొనుగోలు చేయడమే అసలు సమస్య. ఈ నెలలోనే వేల రూపాయల మేరకు పది గ్రాముల బంగారం ధర పెరిగింది. ఇక వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. ఈ రెండు వస్తువులు కొనుగోలు చేయడానికి ఆర్థిక స్థోమత అవసరం. అందుకే బంగారం కొనుగోళ్లు గత కొంతకాలంగా మందగించాయి. అనేక విషయాల్లోనూ భారతీయులతో పాటు ప్రధానంగా దక్షిణాది ప్రాంతానికి చెందిన వారు రాజీ పడి శుభకార్యాలను నిర్వహించుకునే పరిస్థితికి వచ్చింది.
భారీగా పెరగడంతో...
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మళ్లీ ప్రారంభమయింది. శుభ కార్యాలు కూడా జరుగుతున్నాయి. బంగారం ధరలు పెరగడమే తప్ప ఇక తగ్గేది ఉండదన్నది అందరికీ తెలుసు. దీపావళి కూడా ఉండటంతో ధన్ తెరాస్ దెబ్బకు బంగారం పది గ్రాములు లక్షన్నరకు చేరుకుంటుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వేల రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,09,310 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,250 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,60,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులుండవచ్చు