Gold Price Today : దిగిరాకపోగా.. పైకి ఎగబాకుతున్నాయిగా.. నేటి బంగారం ధరలు ఎంతంటే?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
బంగారం ధరలు మరింత పెరుగుతాయి. ధరలు పైకి ఎగబాకుతుండటంతో వినియోగదారులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. బంగారం ధరలు అందుబాటులోకి రాక దాదాపు ఏడు నెలలు పైగానే అవుతుంది. ఏడు నెలల కాలంలో బంగారం అమ్మకాలు గణనీయంగా పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది బంగారాన్ని కొనుగోలు చేసిన వారి సంఖ్య పది శాతం కూడా లేదని అంటున్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్లకు, పండగలకు కూడా బంగారం కొనుగోలుకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. గత ఏడాది అమ్మకాలు జోరుగా జరిగాయని, అదే సమయంలో ఈ ఏడాది మాత్రం పడకేశాయని వ్యాపారులు చెబుతున్నారు.
ధరలు అందుబాటులో లేక...
బంగారం కొనుగోలు చేయాలంటే ధరలు అందుబాటులో ఉండాలి. ఏ వస్తువు అయినా సరే.. తమ ఆర్థిక స్థోమతను మించి ధర పలికితే ఖచ్చితంగా దానికి దూరంగా జరగడం మానవ నైజం. ఇప్పుడు జరుగుతున్నదదే. గత నెలన్నర రోజులుగా పది గ్రాముల బంగారం ధరలు లక్ష రూపాయల నుంచి దిగి రావడం లేదు. లక్ష రూపాయలు వ్యయం చేసి కొనుగోలు చేయడంపై పెదవి విరుస్తున్నారు. మరొక వైపు పెళ్లిళ్లు, శుభకార్యాలకు వన్ గ్రామ్ గోల్డ్ తో పాటు గిల్టు నగలు ధరించి మ..మ అనిపించే వారు అధికంగా మారారు. కేవలం స్థోమత ఉన్న వారు తప్పించి బంగారం కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, కొనుగోలు కోసం వచ్చి ధరలను కనుక్కుని తిరిగి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉందని బంగారు వ్యాపారులు చెబుతున్నారు.
ఈరోజు కూడా పెరిగి...
పెళ్లిళ్ల సీజన్ తో పాటు పెట్టుబడి పెట్టే వారు సయితం బంగారం ధరలను చూసి భయపడిపోతున్నారు. ఒక్కసారి పెరిగిన బంగారం ధరలు ఇక దిగి రావడం అసాధ్యమని అందరికీ తెలుసు. అందుకే ఇక బంగారంపై ఆశలు వదులుకోవాల్సిందేనని చాలా మంది దానికి దూరమయ్యారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ననమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,450 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,08,490 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,38,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.