Gold Rates Today : షాక్ లు మీద షాక్ లు ఇస్తున్న గోల్డ్.. నేటి బంగారం ధరలు చూస్తే

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా అదే స్థాయిలో పెరుగుదల కనిపించింది

Update: 2025-09-03 03:58 GMT

బంగారం ధరలు మరింత ప్రియమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ధరలు దూసుకుపోయాయి. కొనుగోలు చేసే వారు లేక జ్యుయలరీ దుకాణాల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. జ్యుయలరీ దుకాణలకు వస్తున్నారు.. చూస్తున్నారు.. వెళుతున్నారు అన్నట్లుగా తమ పరిస్థితి తయారైందని, కొనుగోళ్లు మాత్రం జరగడం లేదని చెబుతున్నారు. కేవలం కొందరు మాత్రమే అది కూడా తక్కువ మొత్తంలో తమకు అవసరమైనంత మేరకు బంగారాన్ని కొనుగోలు చేయడానికి వస్తుండగా, మరికొందరు మాత్రం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మాత్రమే దుకాణాలకు వచ్చి ఆభరణాల ధరలను చూసి తిరిగి కొనుగోలు చేయకుండా వెనక్కు వెళ్లిపోతున్నారని చెబుతున్నారు.

గత కొన్ని రోజులుగా...
పెళ్లిళ్ల సీజన్ తో పాటు పండగలు కూడా ఉండటంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టానికి ధరలు చేరుకున్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పోటీ పడుతున్నాయి. వెండిని టచ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో పాటు సంకాల మోత మోగించడంతో పాటు అంతర్జాతీయ ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదేసమయంలో వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి.
ఈరోజు కూడా పెరిగి...
బంగారం, వెండి అంటే సురక్షితమైన పెట్టుబడి అని చాలా మంది నమ్ముతారు. బంగారంపై పెట్టుబడి పెడితే తమ డబ్బులు తమకు తిరిగి రావడంతో పాటు అధికంగా లాభాలు ఆర్జించిపెడతాయని నమ్ముతారు. అలాంటి సమయంలో బంగారం ధరలు పెరగడంతో పెట్టుబడి పెట్టేవారు కూడా కనిపించడం లేదు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా అదే స్థాయిలో పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,260 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,06,100 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,36, 200 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News