Gold Rates Today : బంగారంపై ఇక ఆశలు వదులుకోండి.. కొనుగోలు చేయడం ఎవరి వల్లా కాదు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారాన్ని కొనుగోలు చేయడం ఇక ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే బంగారం బరువు పెరిగినపోయింది. తూకం వేస్తే కరెన్సీ నోట్లు బంగారం కంటే ఎక్కువ తూగుతున్నాయి. అంటే లక్షలు పెట్టి బంగారాన్ని కొనుగోలు చేసే పరిస్థితి కొందరికి మాత్రమే ఉంటుంది. వారికే బంగారం కొనుగోలు సాధ్యమవుతుంది. మధ్యతరగతి, వేతనజీవులకు మాత్రం ఇక బంగారం కొనుగోలు చేయడం గగనం అవుతుంది. బంగారం కొనుగోలు చేయడానికి తాము సంపాదించిన ఆస్తులు సరిపోవన్న నానుడి ఖచ్చితంగా సరిపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో కొనుగోలు దారులు బంగారంపై ఆశలు వదిలేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ ఆభరణాలపై దృష్టిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రత్యామ్నాయంపై...
బంగారం ధరలు ఇలా పెరుగుతుండటంతో అమ్మకాలు కూడా బాగా తగ్గాయి. అంతర్జతీయంగా ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. గ్రాము బంగారం కొనుగోలు చేయాలన్నా గగనం అవుతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం స్థానంలో ప్రత్యామ్నాయంగా వేరే ఆభరణాలను ఇప్పటికే వినియోగించడం మొదలయిందంటున్నారు. బంగారంపై పెట్టే సొమ్ము ఇతర ప్రత్యామ్నాయ వస్తువులపై పెడితే మంచిదన్న భావన అందరిలోనూ కలుగుతుంది. అందుకే సీజన్ లోనూ కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు.
భారీగా పెరిగి...
పెట్టుబడిగా చూసేవారు సయితం బంగారాన్ని కొనుగోలు చేయాలంటే భయపడిపోతున్నారు. ఒకవేళ లక్షలు పెట్టుబడి బంగారాన్ని కొనుగోలుచేస్తే ఆ ధర నిలకడగా ఉంటుందా? లేదా? అన్న అనుమానంతో వారు కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,05,850 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,15,480 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,59,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ఈ ధరలు మరింత పెరగవచ్చు.