Gold Rates Today : రికార్డు స్థాయికి చేరుకున్న పసిడి ధరలు.. బంగారం ధరలు ఈరోజు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు మరింతగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ధరలు ఇంతగా పెరగడానికి కారణం అనేకం. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరుగుదల, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, పెంచిన సుంకాలు, యుద్ధాలు వంటివి ఒక కారణంకాగా, వరస పండగలు కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ధరలు పెరిగినంతగా ఎప్పుడూ పెరగలేదని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం కూడా చెబుతుంది.
పెళ్లిళ్లు.. పండగలు...
పెళ్లిళ్ల సీజన్, పండగలు వరసగా వస్తుండటంతో ధరలు మరింతగా పెరుగుతున్నాయి. దసరా, దీపావళితో పాటు ధన్ తెరస్ వల్ల కూడా బంగారానికి డిమాండ్ పెరిగింది. దీపావళికి లక్ష్మీదేవి పూజలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. లక్ష్మీదేవికి పూజలు నిర్వహించే సమయంలో కొత్తగా కొనుగోలుచేసిన బంగారు ఆభరణాలను అమ్మవారి ముందు ఉంచి పూజలు నిర్వహిస్తారు. దీంతో ఇటీవల కాలంలో బంగారం కొనుగోళ్లు కూడా కొంత పెరిగాయంటున్నారు. పెళ్లళ్లకు కూడా బంగరాన్ని కొనుగోలు చేయడం ఇక తప్పనిసరి స్థితిలో చేస్తున్నారు. ఇప్పటి వరకూ తగ్గుతాయని భావించి కొంత కొనుగోలు చేయడం తగ్గించినప్పటికీ ఇక తగ్గవని భావించి కొనుగోళ్లు పెరిగాయంటున్నారు.
భారీగా ధరలు పెరిగి...
బంగారంపై పెట్టుబడి పెట్టేవారు సయితం బంగారం ధరలు రానున్న కాలంలో మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. అందుకోసం ఇన్నాళ్లు కొనుగోలు చేయని పెట్టుబడి దారులు సయితం కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 820 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై రెండు వేల రూపాయలు పెరిగింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,02,800 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,12,150 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,45,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు జరగవచ్చు.