Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా.. ఈ ధరలేంట్రా సామీ

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి

Update: 2025-09-11 03:41 GMT

బంగారం ధరలకు రెక్కలు ఉన్నట్లున్నాయి. అందుకే ప్రతిరోజూ బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది తెలియదు. కిందకు చూడటమే బంగారం మర్చిపోయిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా లక్ష రూపాయలు దాటేసింది. దీనికి తోడు అదనపు పన్నులు చెల్లించాల్సి రావడంతో పాటు తరుగు అంటూ మరికొంత వినియోగదారుల నెత్తిన వేస్తుండటంతో ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలంటే సంపన్నులకు మాత్రమే సాధ్యమవుతుంది. బంగారం అనేది ఒకప్పుడు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి సెంటిమెంట్ గా చూసేవారు. కానీ నేడు అదే బంగారం అలంకారానికి సంబంధించిన వస్తువుగానే చాలా మంది చూస్తున్నారు.

బంగారం కొనుగోలుకు...
బంగారం, వెండి విషయంలో పేద నుంచి రాజు వరకూ ఎవరూ రాజీ పడరు. తమ స్థోమతకు తగినట్లుగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. బంగారాన్ని చూసుకుని మురిసిపోతుంటారు. బంగారాన్ని అపురూపమైన వస్తువుగానే భావించాల్సి రావడం నిజంగా దురదృష్టకరమేనంటున్నారు. ఇకపై బంగారం కొనుగోలు చేయాలంటే కనీసం నాలుగైదు లక్షల రూపాయలు మన వద్ద ఉండాల్సిందేనన్న భావన బలంగా పడిపోయింది. అంతర్జాతీయంగా మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, బంగారం దిగుమతులు తగ్గడం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో భారీగా పెరుగుతున్నాయి.
మళ్లీ పెరిగి...
ఈ ఏడాదిలోనే వేల రూపాయలకు పైగానే ధరలు పెరగడంతో ఇక బంగారం ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు అదే స్థాయిలో పతనం అవుతాయన్న గ్యారంటీ లేదు. అందుకే పెట్టుబడి పెట్టే వారు కొంత ఆలోచించి బంగారం కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. వెండి కిలోపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరుగంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,310 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,10,520 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,39,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరిగే అవకాశముంది.
Tags:    

Similar News