Gold Rates Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కొంత తగ్గాయి.

Update: 2025-08-27 03:21 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేని పరిస్థితి. ఏ కారణం చేతనైనా బంగారం ధరలు పెరగొచ్చు. అదే సమయంలో తగ్గొచ్చు. అంతర్జాతీయంగా మార్కెట్ లో నెలకొన్న అనిశ్చితలతో పాటు ధరలలో నెలకొన్న ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం, నేటి నుంచి ట్రంప్ అదనపు సుంకాలు అమలు కావడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి. ధరల పెరుగుదలకు స్థానిక వ్యాపారులకు ఏమాత్రం సంబంధం లేదు. అలాగే డిమాండ్, సీజన్ తో క కూడా ధరల ప్రభావం ఉండదని అందరికీ తెలుసు.

ఈ ఏడాది అంతా...
పండగల సీజన్ ప్రారంభమయింది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. అయినా దాదాపు ఎనిమిది నెలల నుంచి బంగారం ధరల్లో మార్పులు కనిపించడం లేదు. లక్ష రూపాయలకు పైగానే ధర పలుకుతూ వినియోగదారులను భయపెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతుండటం కేవలం వినియోగదారులను మాత్రమే కాకుండా వ్యాపారులను కూడా ఆందోళనలోకి నెట్టేశాయనే చెప్పాలి. భారీ మార్కెట్ ఉన్న బంగారం మార్కెట్ గత కొన్ని నెలలుగా కుదేలయిపోయింది. అమ్మకాలు లేవని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బంగారం ధరలు దిగి వస్తే కొనుగోలు చేయాలని చాలా మంది ఎదురు చూస్తుండగా, మరికొందరు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత చూద్దామని భావిస్తున్నారు.
భారీగా పెరగడంతో...
మరొకవైపు బంగారంపై పెట్టుబడి అంటే సురక్షితమని నిన్న మొన్నటి వరకూ భావించేవారు. కానీ మార్కెట్ అప్ అండ్ డౌన్ గా నడుస్తుండటంతో పెట్టుబడి పెట్టేవారు సయితం ఒకంత కొనుగోలుకు ఉత్సాహం చూపడం లేదు. దీంతో భారత్ లో బంగారం మార్కెట్ వెలవెల పోతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కొంత తగ్గాయి. ఉదయం ఆరుగంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,560 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 102,070 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,29,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News