Gold Prices Today : పసిడి ధరలు చూస్తేనే అమ్మో అనిపిస్తుందిగా.. కొనుగోళ్లు మాత్రం?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి

Update: 2024-04-16 03:42 GMT

బంగారం ధరలు పెరగడం అనేది ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తగ్గుతున్నది మాత్రం చాలా తక్కువ సార్లు మాత్రమే. పెరిగితే పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయల వరకూ పెరుగుతుంది. అలాగే తగ్గితే పది రూపాయలు పది గ్రాముల పై తగ్గుతుంది. వెండి విషయంలోనూ అంతే పెరిగితే కిలో వెండి ధరపై వేయి నుంచి రెండువేల రూపాయల వరకూ పెరుగుతుంది. తగ్గితే మాత్రం వంద రూపాయలు తగ్గుతుంది.

కొనుగోళ్లు తగ్గకపోవడంతో...
పసిడి కొనుగోళ్లు ఏమాత్రం తగ్గకపోవడంతో పాటు తగినన్ని బంగారం నిల్వలు కూడా లేకపోవడం కారణంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పసిడి ఎక్కువగా కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్న వారు దానిని మానుకోలేకపోవడంతోనే అమ్మకాలకు ఏ మాత్రం కామా కూడా పడటం లేదు. సీజన్ తో నిమిత్తం లేకుండా బంగారం ధరలు మరింత పెరుగుతుండటం కొనుగోలుదారులను ఆందోళన కలిగిస్తున్నప్పటికీ వాటిని పెద్దగా లెక్క చేయకుండా పర్చేజ్ చేయడం అలవాటుగా మార్చుకున్నారు.
ధరలు ఇలా....
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,060 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,160 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర మాత్రం 89,600 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News