Gold Prices Today : మహిళలకు షాకింగ్ న్యూస్... పెరిగిన బంగారం, వెండి ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే రీతిన పయనిస్తున్నాయి

Update: 2024-04-01 03:14 GMT

పసిడి ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. దానికి కళ్లెం వేయడం అనేది జరగని పని. పసిడి పరుగులు పెట్టినంతగా ఏ వస్తువూ పరుగులు తీయవు. బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. పసిడి అంటేనే పడి చచ్చిపోయే ప్రజలు ఉన్నంత వరకూ పరిస్థితి ఇలానే ఉంటుంది. కొందరు స్టేటస్ సింబల్ గా చూస్తుంటే.. మరికొందరు శుభసూచకంగా భావిస్తూ పసిడిని కొనుగోలు చేయడం మన సంప్రదాయంగా వస్తుండటంతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి.

డిమాండ్‌కు తగినట్లు...
అయినా కొనుగోలుదారులు మాత్రం వెనుకంజ వేయరు. కారణం.. ఎప్పటికైనా పసిడి మీద పెట్టిన ప్రతి రూపాయి నష్టం వాటిల్లదనే ఒకే ఒక ధీమా. అందుకే పసిడిని ఎంత థర పెట్టైనా కొనుగోలు చేస్తుంటారు. అదే ఇప్పుడు ధరలు పెరగడానికి అసలు కారణమయింది. డిమాండ్ కు తగినంతగా బంగారం లేకపోవడం, దిగుమతులు తగ్గడంతోనే పసిడి ధరలు పైపైకి చూస్తున్నాయని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. ఇక పెళ్ళిళ్ల సీజన్ ముగిస్తే ధరలు తగ్గుతాయని భావించిన వారికి కూడా ఇది చేదువార్త లాంటిదే. ఎందుకంటే ధరలు ఇంకా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పెరిగిన ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే రీతిన పయనిస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,740 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,440 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 80,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News