Gold Rates Today : బంగారం కొనుగోలు చేసే వారికి తీపి కబురు.. గతంలో ఎన్నడూ తగ్గనంత
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని అందరూ చెబుతున్నారు. ఎవరూ పాత బంగారాన్ని విక్రయించుకోవద్దని, దాచుకుంటే అది మరింత లాభాలు తెచ్చిపెడుతుందని సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది తమ వద్ద అవసరానికి మించి ఉన్న బంగారాన్ని విక్రయించడానికి జ్యులయరదీ దుకాణాలకు క్యూ కడుతున్నారు. కనీసం భారీగా ధరలు ఉన్నప్పుడు సొమ్ము చేసుకుని బ్యాంకులో దాచుకుంటే వడ్డీతో కొంత మేరకు లాభం పొందవచ్చన్న భావనలో ఉన్నారు. అయితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని, ఇప్పుడు బంగారాన్ని విక్రయిస్తే పేద, మధ్యతరగతి, వేతనజీవులు ఇక బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.
ప్రస్తుత జనరేషన్...
అయితే ప్రస్తుత జనరేషన్ అది మహిళల్లో బంగారం పట్ల పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. పూర్వీకుల తరహాలో బంగారు ఆభరణాలను ధరించి ఫంక్షన్లకు వెళ్లాలన్న ఆలోచనలో కూడా వారికి ఉండటం లేదు. ఏదైనా సింపుల్ గా కనిపించడం ఇప్పటి జనరేషన్ కు అలవాటుగా మారడంతో ఈ తరం యువతులు బంగారంపై పెద్దగా మోజు చూపడం లేదంటున్నారు. అలాగని బంగారాన్ని కొనుగోలు చేయరని కాదు. భవిష్యత్ లో తమకు ఉపయోకరంగా ఉంటుందని, భరోసాగా నిలుస్తుందని బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు నేటి యువత. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న యువతులు కూడా బంగారాన్ని ఆభరణాలుగా చూడకుండా సంపదగానే పరిగణిస్తున్నారు.
భారీగా తగ్గినా...
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు ఎగబాకుతున్నాయి. బంగారంతో పోటీ పడి వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతుండంతో రెండు వస్తువుల కొనుగోళ్లు చాలా వరకూ తగ్గాయి. అయితే ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 930 రూపాయలు తగ్గింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,04,890 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,14,430 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,49,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.