Gold Rates Today : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు... ఇప్పడు కొనకుంటే ఇక అంతే

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది.

Update: 2025-09-19 03:27 GMT

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతుంటాయి. పెరిగిన సమయంలో ఎక్కువగా ధరలు పెరుగుతాయి. చాలా అరుదుగా బంగారం ధరలు తగ్గుతుంటాయి. తగ్గిన సమయంలో పది రూపాయలకు మించి తగ్గదు. బంగారం, వెండి విషయాల్లోనే ఇలా జరుగుతుంటుంది. బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు నిరంతరం నిరీక్షిస్తుంటారు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అందుకోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తారు. కానీ గత కొన్నిరోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది అస్సలు జరగడం లేదు. అందుకే అమ్మకాలు కూడా ఊపందుకోలేదని బంగారం వ్యాపారులు చెబుతున్నారు.

గిఫ్ట్ ఇద్దామన్నా...
బంగారం అంటేనే అదొక మోజు. అదొక క్రేజు. కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు. స్టేటస్ సింబల్ గా కూడా చూస్తుంటారు. అంతేకాదు.. భారతీయుల జీవితంలో బంగారం, వెండి ఒక భాగమయింది. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా చివరకు పుట్టినరోజు కూడా బంగారు ఆభరణాలను కానుకగా ఇవ్వడం ఫ్యాషన్ గా మారిపోయింది. కానీ అది ఒకప్పుడు. కానీ పెరిగిన ధరలతో బంగారం, వెండి బహుమతుల రూపంలో ఇచ్చేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. తాము కొనుగోలు చేయడమే కష్టమయిన నేటి సమయంలో ఎంతటి ఆప్తులకయినా బంగారం, వెండి వస్తువులను తాము బహుమతిగా ఇచ్చేందుకు సుముఖంగా లేరు. తద్వారా అమ్మకాలు కూడా నిలిచిపోయాయంటున్నారు.
భారీగా తగ్గి...
ఇక బంగారంపై ఎక్కువ మంది మొన్నటి వరకూ పెట్టుబడి పెట్టేవారు. ప్రధానంగా ఆభరణాలు కాకుండా బంగారం బిస్కెట్లను కొనుగోలు చేసి ధర ఎక్కువగా ఉన్న సమయంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుని లబ్ది పొందుతుంటారు. ఆ గిరాకీ కూడా తగ్గిందంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై ఐదువందల రూపాయల వరకూ తగ్గింది. కిలో వెండి ధరపై నాలుగు వేల రూపాయలు తగ్గింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,890 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,11,160 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,40,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు.


Tags:    

Similar News