Gold Price Today : గుడ్ న్యూస్ అంటున్నారు తప్ప.. బంగారం ధరలు తగ్గిందెక్కడ?
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి.
దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. బంగారం, వెండి ధరలు పెరగడం కొత్తేమీ కాకపోయినప్పటికీ గత తొమ్మిది నెలలుగా ధరలు విపరీతంగా పెరుగుతుండటం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇలా ధరలు ఏ ఏడాది పెరగలేదని చెబుతున్నారు. ఇకపై పెరగకుండా ఆగవని ఎవరూ చెప్పలేరని కూడా అంటున్నారు. బంగారం ధరలు తగ్గుతాయని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు నిజం కావని కూడా అంటున్నారు. బంగారానికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. అలాగని డిమాండ్ అండ్ సప్లయ్ పై ఆధారపడి ధరలు పెరగడం అనేది బంగారం విషయంలో జరగదని కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అవసరానికి సరిపడా బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
పండగల వేళ...
పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగల వేళ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు ట్రేడ్ వర్గాలు బంగారాన్ని ఎప్పుడు కొనుగోలు చేసినా నష్టం రాదని చెబుతున్నారు. ఇప్పుడు కొనుగోలు చేస్తే బంగారాన్ని కొనుగోలు చేసినందుకు సంతోషిస్తారని, అదే మంచి పెట్టుబడి అని బిజినెస్ విశ్లేషకులు కూడా అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం బంగారం ధరలు తగ్గడానికి అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు తగ్గడం కారణంగా ధరలు దిగివస్తాయని చెబుతున్నారు. కానీ జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే బంగారం ధరలు ఇప్పట్లో దిగి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
కొద్దిగా తగ్గినా...
అందుకే పెట్టుబడి పెట్టేవారు సయితం బంగారం కొనుగోలు పై ఒకింత వెనకడుగు వేస్తున్నారు. బంగారం పై పెట్టుబడి సురక్షితామా? కాదా? అన్నది పక్కన పెడితే దానిని కొనుగోలు చేయడం శ్రేయస్కరం కాదని నమ్ముతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయల వరకూ తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,790 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,11,050 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,42,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.