Gold Rates Today : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న హెచ్చరికలు నిజం కావడం లేదు కానీ, తగ్గడం కూడా అంత భారీగా జరగడం లేదు. ఏదో తగ్గిందని సంతోషపడేందుకేనని చెప్పాలి. నిజానికి బంగారం కొనుగోలు చేయడం కంటే ఇప్పుడు ప్లాటినం ధర చాలా తక్కువగా ఉంది. గతంలో ప్లాటినం బంగారం ధరను మించి పోయిఉండేది. అలాంటిది ఈరోజు ప్లాటినం ధరలను దాటేసి బంగారం అందరి అంచనాలను తలకిందులను చేసింది. అయితే సామాన్యులు కొనే స్థాయికి మాత్రం బంగారం ధరలు చేరుకోవడం లేదు. అందుకే కొనుగోళ్లు కూడా ఊపందుకోవడం లేదు. ధరలు ఎంత తగ్గినా లక్ష రూపాయలకు తగ్గకుండా బంగారం ఉండటంతో వినియోగదారులు, మదుపరులు ఇబ్బందులు పడుతున్నారు.
సీజన్ అయినా...
శ్రావణ మాసంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా జోరుగా నడుస్తుంది. గత కొద్ది రోజుల నుంచి వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రతి రోజూ పెళ్లి బాజా వినిపిస్తూనే ఉంది. మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లతో పాటు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరుగుతుండటంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం భావించింది. కానీ వారి అంచనాలకు అందని విధంగా అమ్మకాలు మాత్రం ఊపందుకోలేదు. దీనికి ప్రధాన కారణం బంగారం ధరలు తగ్గకపోవడమేనని వ్యాపారులు చెబుతున్నారు. మరొకవైపు వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ఆభరణాలను కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.
కొద్దిగా తగ్గినా...
ఇక పెట్టుబడి దారులు సయితం బంగారంపై మదుపు చేయడానికి ఉత్సాహం చూపడం లేదు. వారు ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. దీంతో భారీగా ఈసారి ఈ ఏడాదిలో ఏడు నెలల నుంచి బంగారం, వెండి అమ్మకాలు పడిపోయాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,740 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,170 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,27,100 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండే అవకాశముంది.