Gold Rates Today : తీపి కబురు.. బంగారం ధరలు తగ్గాయ్.. నేటి ధరలు ఎంతంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.

Update: 2025-08-25 03:11 GMT

బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. పసిడి ధరలు సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు చేయడానికి అయిష్టత చూపుతున్నారు. బంగారం, వెండి ధరలు ఇంతలా పెరగడం గతంలో ఎన్నడూ చూడలేదు. ఇప్పటికీ గత పది రోజులకు పైగానే లక్ష రూపాయలుగా పది గ్రాముల బంగారం ధర కొనసాగుతూనే ఉంది. మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తుండటంతో బంగారం, వెండి ఆభరణాల అమ్మకాలు జోరుగా జరుగుతాయని భావించిన వ్యాపారులు పెద్దమొత్తంలో సరుకును తెప్పించారు. అయితే కొనుగోళ్లు లేకపోవడంతో చాలా వరకూ సరకు అలాగే మిగిలిపోయిందన్న ఆవేదన చెందుతున్నారు.

ధరలు పెరగడానికి...
అసలు బంగారం ధరలు ఇంతలా పెరగడానికి కారణాలేంటి? అన్న దానిపై ప్రత్యేకం ఏమీ లేదంటున్నారు. అనేక కారణాలు బంగారం ధరల పెరుగుదలకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. అంతర్జాతీయంగా, దేశీయంగా జరిగే పరిణామాల ప్రభావం కూడా బంగారం ధరలపై పడుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎక్కడ ఏ యుద్ధం జరిగినా, డాలర్ తో రూపాయి విలువ మరింతగా పడిపోయినా, ద్రవ్యోల్బణం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, వివిధ దేశాలకు చెందిన అగ్రనేతల నిర్ణయాల ప్రభావం కూడా బంగారం ధరలపై పడుతుందని అంటున్నారు. అంతే కాకుండా దిగుమతులు నిలిచిపోవడం వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతాయన్న కారణమూ లేకపోలేదంటున్నారు.
కొద్దిగా తగ్గి...
ఇప్పటికే అనేక మంది బంగారానికి దూరమయ్యారు. నిన్న మొన్నటి వరకూ పెట్టుబడి పెట్టే వారు అయినా బంగారాన్ని కొనుగోలు చేసేవారు. ఇప్పుడు వారు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించడం మొదలుపెట్టేసరికి ధరలు మరింత పెరిగాయంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర పై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,140 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,610 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,29,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.



Tags:    

Similar News