Gold Rates Today : పాత బంగారాన్ని అమ్మేయకండి.. అదే మీకు లక్షలు తెచ్చిపెడుతుంది

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కొద్దిగా తగ్గుదల కనిపించింది

Update: 2025-09-25 03:19 GMT

బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతుండటంతో కొత్తగా బంగారాన్నొ కొనుగోలు చేయడం మధ్యతరగతి, వేతనజీవులకు కష్టంగా మారింది. అయితే బంగారం విషయంలో ఒక సూత్రం ఉంది. పాత బంగారానికి విలువ ఎక్కువ. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పాత బంగారాన్ని విక్రయించుకుని సొమ్ము చేసుకోవాలని కొందరు చూస్తున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదంటున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. ముందుగానే తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించుకుంటే తర్వాత ధరలను చూసి బాధపడతారని చెబుతున్నారు. అదీ కాకుండా తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని డబ్బుల కోసం విక్రయిస్తే ఇక భవిష్యత్ లో కొనుగోలు చేయడం కష్టమవుతుందన్నది నిపుణుల అభిప్రాయం.

ఆర్ధికంగా ఇబ్బందుల్లో...
బంగారు ఆభరణాలు కేవలం అలంకరణకు మాత్రమే కాదు.. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు.. ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పుడు పసిడి మనకు అండగా ఉంటుంది. అప్పుడు బంగారమే మన్నలి ఆదుకుంటుంది. అందుకే ఎక్కువ ధర ఉందని పాత బంగారాన్ని విక్రయించుకుండా అవసరమైతే బ్యాంకుల్లో కుదువ పెట్టుకుని తాత్కాలికంగా కష్టాల నుంచి గట్టెక్కగలిగితే బంగారం మన వద్ద ఉంటుంది. కుదువ పెట్టిన బంగారం తక్కువ వడ్డీ కావడంతో తిరిగి ఇంటికి తెచ్చుకునే వీలుంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు మంచి ధర వచ్చింది కదా? అని ఉన్న బంగారాన్ని తెగ నమ్మితే పాత మేలిమి బంగారాన్ని మనం కోల్పోతామన్న హెచ్చరికలు బాగా వినిపిస్తున్నయి.
స్వల్పంగా తగ్గినా...
ఇప్పటికే లక్ష రూపాయలు దాటి పోవడంతో తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని అమ్మడానికి సిద్ధమయ్యారు. బంగారం విషయంలో తొందరపాటు వద్దని బిజినెస్ నిపుణులు కూడా చెబుతున్నారు. ధరలు మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,05,740 రూపాయలుగా నమోదయింది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,15,360 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,49,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు.


Tags:    

Similar News