Gold Rates Today : గుడ్ న్యూస్ .. ధరలు తగ్గాయ్ కానీ... కొనుగోలు చేయాలంటేనే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడు సామాన్యులకు సాధ్యం కాని పని. ఎందుకంటే గ్రాము బంగారం కొనుగోలు చేయడంతో ఒక నెల కుటుంబం నడిచే పరిస్థితి ఉంటుంది. అనవసర ఖర్చుగా బంగారాన్ని భావించే రోజులు వచ్చాయి. సెంటిమెంట్, స్టేటస్ సింబల్ ను పక్కన పెట్టి అధిక వ్యయం చేసి కొనుగోలు చేయడం వృధా అని భావించే వారు ఎక్కువయ్యారు. బంగారం ధరలు గత కొద్ది నెలలుగా పెరుగుతూనే ఉన్నాయి. అస్సలు తగ్గడం లేదు. తగ్గినా కొద్దో గొప్పో తగ్గుతున్నాయి. పెరిగితే మాత్రం భారీగా పెరిగాయి. గత వారం రోజుల్లో బంగారం ధరలు పది గ్రాముల పై దాదాపు ఆరువేల రూపాయల వరకూ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
కొనుగోలు ఆసక్తి తగ్గి...
గోల్డ్ కొనుగోలు చేయాలన్న ఆసక్తి కూడా బాగా తగ్గిపోయింది. బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే మరొకదానిపై పెట్టుబడి పెడితే మరింత సేఫ్ అని పెట్టుబడుదారులు సయితం అభిప్రాయపడుతున్నారంటే బంగారం ధరల పెరుగుదలపై అనుమానాలు ఏ రేంజ్ లో వ్యక్తమవుతున్నాయో అర్థమవుతుంది. ఇంతలా పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా పడిపోతే నష్టం వాటిల్లితుందని భావించి పెట్టుబడి దారులు ఇతర ప్రత్యామ్నాయం వైపు మళ్లిస్తున్నారు. దీంతో సాధారణ వినియోగదారులతో పాటు పెట్టుబడి దారులు కూడా కొనుగోలు చేయకపోవడంతో బంగారం అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. అయినా డిమాండ్ తగ్గినా ధరలు మాత్రం తగ్గడం లేదు.
స్వల్పంగా తగ్గి...
పెళ్లిళ్ల సీజన్ మరికొంత కాలం నడుస్తుంది. దసరా, దీపావళి, సంక్రాంతి వరకూ వరసగా పండగలు వస్తున్నాయి. దీంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియ్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం 97,640 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,06,850 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,36,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.