Gold Rates Today : తీపికబురు.. బంగారం ధరలు దిగివస్తున్నాయ్.. ధరలు ఎంతంటే?

ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరల్లో కొద్దిగా పెరుగుదల కనిపించింది.

Update: 2025-08-26 03:42 GMT

బంగారం ధరలు శ్రావణ మాసంలో కొంత శాంతించాయని చెప్పాలి. ఆగస్టు ముందు వరకూ ఒక రేంజ్ లో పెరిగిన బంగారం, వెండి ధరలు ఆ తర్వాత మాత్రం కొంత తగ్గుదలతో కనిపిస్తున్నాయి. శ్రావణ మాసం ఆరంభం నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయినా కొనుగోళ్లు ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో పాటు డిమాండ్ కూడా తగినంతగా లేకపోవడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు దిగి రాలేదని అంటున్నారు. ఇంకా ధరలు తగ్గితేనే వినియోగదారులు జ్యుయలరీ దుకాణాల వైపు చూస్తారని, అప్పటి వరకూ బంగారం కొనుగోలు ఆలోచనను పక్కన పెడతారని వ్యాపారులే చెబుతున్నారు.

భారీగా మాత్రం...
బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ భారీగా మాత్రం తగ్గడం లేదు. ధరలు పెరిగిన రేంజ్ లో తగ్గినప్పుడు తగ్గడం లేదు. అదే సమయంలో బంగారం ధరల్లో మార్పునకు అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్బోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వంటి కారణాలు కూడా బంగారం ధరల మార్పుపై ప్రభావ చూపుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ధరలు పెరగడం సహజమేనని, డిమాండ్, సీజన్ తో సంబంధం లేకుండా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
వెండి ధర పెరిగి...
పెళ్లిళ్ల సీజన్ ఇంకా మరో మూడు నెలలు ఉండటంతో ధరలు తగ్గితేనే తమకు అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. అప్పటి వరకూ కొనుగోలు దారులు పెద్దగా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రారని అంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరల్లో కొద్దిగా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,040 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,500 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,31,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నం ఈ ధరల్లో మార్పులుండవచ్చు.






Tags:    

Similar News