Gold Rates Today: చల్లటి కబురు.. బంగారం ధర నేడు కూడా తగ్గింది.. ధరలు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర స్వల్పంగా పెరిగింది
పుత్తడి అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అందరూ బంగారాన్ని సొంతం చేసుకుందామని భావిస్తారు. తమకున్న కొద్ది డబ్బుతోనైనా బంగారాన్ని కొనుక్కుంటే భవిష్యత్ కు భరోసా లభిస్తుందని భావిస్తున్నారు. అందులోనూ శుభకార్యాలకు బంగారం, వెండి వస్తువులను ఎక్కవగా కొనుగోలు చేస్తారు. సెంటిమెంట్ కావడంతో ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయడం సంప్రదాయంగా పెట్టుకున్నారు. వరుడికి, వధువుకు బంగారు నగలను పెళ్లిళ్లలో పెట్టడం ఆచారంగా మారింది. దీంతో పెళ్లిళ్ల సీజన్ సమయంలో సహజంగానే బంగారం, వెండి వస్తువుల కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. కానీ పెరిగిన ధరలు చూసి ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్ లో ఆశించినంత మేరకు అమ్మకాలు జరగలేదు.
తరగని సంపద...
అయితే బంగారం అనేది ఎప్పుడూ తరగని సంపదగా భావిస్తారు. కష్టకాలంలో ఆదుకునే వస్తువుగా భావిస్తారు. బంగారం మన వద్ద ఉంటే సులువుగా మార్చుకునేందుకు, విక్రయించుకుని సొమ్ము చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులుండవు. ఆరోగ్య పరమైన ఇబ్బందుల విషయంలో కానీ, కుటుంబానికి అవసరమైన సమయంలో కానీ బంగారాన్ని సులువుగా కుదువ కూడా పెట్టి అవసరమైనంత నగదును బ్యాంకులలో కుదువ పెట్టి తక్కువ వడ్డీకి రుణం పొందే అవకాశముండటంతో ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. గతంలో కరోనా సమయంలో ఉపాధి కోల్పోయినట్లు తమను పసిడి ఆదుకుందని అనేక మంది ఇప్పటికీ అంగీకరిస్తారు.
స్వల్పంగా తగ్గినా...
అయితే గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలతో పెట్టుబడి దారులు కూడా ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. తాము బంగారంపై పెట్టే పెట్టుబడిని వేరే వాటికి తరలిస్తున్నారు. ప్రస్తుతం బంగారం కంటే ప్లాటినం అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,140 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,520 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,28,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.