Gold Rates Today : తగ్గుతున్నాయంటున్నా.. బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది.

Update: 2025-08-21 03:25 GMT

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అనేది తక్కువగా జరుగుతుంది. కానీ గత వారం రోజుల నుంచి బంగారం ధరలు స్వల్పంగానైనా ధరలు తగ్గుతున్నాయి. అయితే కొనుగోలుదారులు ఆశించిన స్థాయిలో మాత్రం ధరలు తగ్గలేదు. అందుకే ధరలు ఎంత తగ్గుతున్నాయని చెబుతున్నప్పటికీ బంగారం కొనుగోలు చేసే వారు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే బంగారం అనేది సెంటిమెంట్. స్టేటస్ సింబల్. దానిని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అదే సమయంలో ధరలు కూడా అందుబాటులో ఉన్నప్పుడే కొనుగోళ్లు పెరుగుతాయి. అందువల్ల ధరలు తగ్గాయని సంబరపడేకంటే ఎంత తగ్గాయన్నది ముఖ్యమని కొనుగోలు దారులు అంటుున్నారు.

పెరిగినంత స్థాయిలో...
బంగారం ధరలు పెరిగిన స్థాయిలో మాత్రం ధరలు తగ్గడం లేదు. వెండి ధరలు కూడా అందనంత దూరంలో ఇప్పటికే పెరిగిపోయాయి. గత కొంతకాలంగా ధరలు పెరుగుతున్న సమయంలో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసే వారు దాదాపుగా కనిపించడం లేదనే అనుకోవాలి. అత్యవసరమైతే తప్ప, అలాగే వివాహాది శుభకార్యాలకు అవసరమైనంత మేరకు మాత్రమే బంగారం కొనుగోలు చేసి సరిపెడుతున్నారు. గతంలో మాదిరిగా ఎగబడి కొనేవారు మాత్రం ఈ ఏడాదిలో కనిపించడం లేదు. తమకు అవసరమైనంత మేరకు మాత్రమే కొనుగోలు చేస్తుున్నారని, పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ఆ మాత్రం అమ్మకాలు జరుగుతున్నాయని బంగారు దుకాణాల వ్యాపారులు చెబుతున్నారు.
నేటి ధరలు ఇలా...
అలాగే పెట్టుబడి పెట్టేవారు కూడా భయపడి పోయే పరిస్థితి వచ్చింది. బంగారం కొనుగోలు చేయకపోగా తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మకానికి పెడుతుండటంతో ధరలు కొంత దిగివస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,790 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,140 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,24,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News