Gold Rates Today : గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయ్.. అయినా లక్ష నుంచి దిగి రాలేదు

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.

Update: 2025-08-20 03:48 GMT

దేశంలో బంగారం ధరలు మరింత ప్రియమవుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదు. కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి బంగారం ఇక చేదుగా మారుతుంది. ఎందుకంటే రాను రాను ఎక్కువగా ధరలు పెరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బంగారం ధరలు ఇంతగా పెరగడానికి అనేక కారణాలున్నప్పటికీ కొనుగోలు చేసే స్థాయిలో ధరలు లేనప్పుడు దాని డిమాండ్ కూడా అంతే స్థాయిలో తగ్గుతుంది. కానీ బంగారానికి ఇవేమీ పట్టవు. డిమాండ్ తోనూ, సీజన్ తోనూ సంబంధం లేకుండా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉంటాయి.

కొన్ని నెలలుగా...
బంగారం ధరలు గత కొన్ని నెలలుగా పెరుగుతూనే ఉన్నాయి. ఏడాది ప్రారంభం నుంచి ధరలు తగ్గడం లేదు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి బంగారం పరుగులు పెడుతూనే ఉంది. ఇటీవల కాలంలో కొంత ధరలు దిగివస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం ధరలు దిగి రావడం లేదు. దీంతో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఇంకా మరో మూడు నెలలు సీజన్ కొనసాగుతుంది. అయినా సరే బంగారం ధరలు అందుబాటులోకి రాకపోవడంతో వినియోగదారులు బంగారం వైపు చూసేందుకే భయపడిపోతున్నారు. అదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
నేటి ధరలు
ఇక పెట్టుబడి దారులు సయితం తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ధరలు మళ్లీ పతనమయితే బంగారంపై పెట్టిన పెట్టుబడులు తిరిగి రావని నమ్ముతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 430 రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారట్ల పది రూపాయల బంగారం ధర 92,340 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,740 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,25,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News