Gold Price Today : బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయో తెలిస్తే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు మరింత పెరుగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా చూస్తున్న వారికి ఇది అర్థమవుతుంది. 2010 లో పది గ్రాముల బగారం ధర పద్దెనిమిది వేల రూపాయల వరకూ ఉంటే.. ఈ పదిహేనేళ్లలో దాని ధర లక్ష రూపాయలకు చేరుకుంది. అంటే ఏ రేంజ్ లో బంగారం ధరలు పెరుగుతున్నాయన్నది అర్థమవుతుంది. అందుకే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు ముందు నుంచి చెబుతున్నారు. ధరలు తగ్గుతాయని కొందరు చెబుతున్న, చేస్తున్న విశ్లేషణలు నిజం అయ్యే అవకాశం లేదు. ఇప్పటికే బంగారం ధరలు లక్ష రూపాయలు దాటేశాయి. ఇంకా పెరగడమే తప్ప తగ్గడం అనేది జరగదని చెబుతున్నారు.
పెళ్లిళ్లు.. పండగ సీజన్ లు...
మరొకవైపు పెళ్లిళ్లు, పండగల సీజన్ కూడా ఎక్కువగా ఉండటంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు అంచనా వేసుకున్నారు. వారి అంచనాలకు భిన్నంగా కొనుగోళ్లు మాత్రం జరగడం లేదు. ధరలను చూసి ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో జ్యుయలరీ దుకాణాల వద్ద సందడి లేకుండా పోయింది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్ లో బంగారం షాపులు కిటకిటలాడుతుంటాయి. అయితే ఎవరో ఒకరిద్దరు మినహా పెద్దగా కనిపించడం లేదు. రాను రాను బంగారం దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే బంగారం కొనుగోళ్లు పెరుగుతాయన్న ఆశ మాత్రం వ్యాపారుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
నేడు స్థిరంగా...
ధరలు పెరగడంతో బంగారం దుకాణాల్లో అమ్మకాలు దాదాపుగా నిలిచిపోయాయి. అయితే బంగారం అనేది భారతీయ సెంటిమెంట్ కావడంతో ఎప్పటికీ డిమాండ్ తగ్గదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా ఎంత పెరుగుతాయన్న చర్చ జరుగుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,440 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,08,480 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,37,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.